మరో వారం రోజుల్లో రామ్ చరణ్-కియారా అద్వానీల గేమ్ ఛేంజర్ ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీగా ఉంది. ప్రమోషన్స్ లో భాగంగా గేమ్ ఛేంజర్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ నిన్న AMB మాల్ లో జరిగింది. రాజమౌళి చీఫ్ గెస్ట్ గా హాజరైన ఈ ఈవెంట్ లో రామ్ చరణ్, శంకర్, దిల్ రాజు, అంజలి, ఎస్ జె సూర్య ఇలా అందరూ కనిపించారు.
కానీ మెయిన్ హీరోయిన్ కియారా అద్వానీ కనిపించకపోవడం మెగా అభిమానులను డిజప్పాయింట్ చేసింది. ఈమధ్య కాలంలో హీరోయిన్స్ కి అవకాశం వస్తే చాలు తమని తాము పబ్లిసిటీ ఎలా చేసుకోవాలో అని ఆలోచిస్తున్నారు. అందులోను పాన్ ఇండియా ఫిలిం గేమ్ ఛేంజర్ సినిమా ప్రమోషన్స్ అంటే ఎలా ఉంటుంది.
వచ్చిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. నేషనల్ మీడియా కవరేజ్ అంటే ఇంకాస్త అలెర్ట్ గా ఉండాలి. కానీ కియారా న్యూ ఇయర్ సెలెబ్రేషన్స్ వలన రాలేదో, లేదంటే ఇతర సినిమాల షూటింగ్స్ వలన గేమ్ ఛేంజర్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ మిస్ అయ్యిందో కానీ.. ప్రస్తుతం కియారా కనిపించకపోవడం ఈ ఈవెంట్ కి వెలితిగా అనిపిస్తుంది అంటూ నెటిజెన్స్ మాట్లాడుకుంటున్నారు.