సంధ్య థియేటర్ ఘటనలో అల్లు అర్జున్ తప్పులేదు, ఆ ఘటనలో అసలు అల్లు అర్జున్ ను నిందించాల్సిన అవసరమే లేదు అంటూ బాలీవుడ్ నిర్మాత బోని కపూర్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు తెగ వైరల్ అవుతున్నాయి.
సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో A 11 ముద్దాయిగా ఉన్న అల్లు అర్జున్ ను అరెస్ట్ చెయ్యడం, అతను హై కోర్టు నుంచి మధ్యంతర బెయిల్ పై బయటికి రావడం, తర్వాత చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ కి విచారణకు హాజరవడం అన్ని తెలిసిన విషయాలే.
అందులో భాగంగానే సంధ్య థియేటర్ వద్ద తొక్కిసలాట ఘటనలో హీరో అల్లు అర్జున్ ను నిందించాల్సిన అవసరం లేదు. జనాలు బాగా ఎక్కువ మంది రావడంతోనే ఈ ఘటన జరిగింది, అందులో అల్లు అర్జున్ తప్పు లేదు అంటూ బోని కపూర్ వ్యాఖ్యానించారు.