రామ్ చరణ్-శంకర్ కాంబోలో తెరకెక్కిన గేమ్ చెంజర్ మూవీ జనవరి 10 న తెలుగు, తమిళ, హిందీ అంటూ 3 లాంగ్వేజెస్ లో విడుదలకు సిద్ధమవుతుండగా.. ఈరోజు గురువారం హైదరాబాద్ AMB మాల్ లో రాజమౌళి చేతుల మీదుగా గేమ్ ఛేంజర్ ట్రైలర్ లాంచ్ చేసారు. ఈ ఈవెంట్ లో దర్శకుడు శంకర్, రామ్ చరణ్, రాజమౌళి, ఎస్ జె సూర్య, అంజలి, దిల్ రాజు అందరూ పాల్గొన్నారు.
ఇక గేమ్ ఛేంజర్ ట్రైలర్లోకి వెళితే కలెక్టర్ గా ప్రజల పక్షాన పోరాడే యువకుడి పాత్రలో రామ్ చరణ్ మాత్రం నిజంగా ఫ్యాన్స్ కే కాదు కామన్ ఆడియన్స్ కు సైతం గూస్ బంప్స్ తెప్పించారు. అసలు రామ్ చరణ్ లుక్స్ చూసి మెగా ఫ్యాన్ చెప్పలేనంత ఎగ్జైట్ అయ్యారంటే చెప్పాలి. విలన్ ఎస్ జె సూర్య తో తలపడే సన్నివేశాలు, అలాగే ఫాదర్ కేరెక్టర్ లోను రామ్ చరణ్ లుక్స్ లో వేరియేషన్స్ చూపించారు.
పవర్ ఫుల్ సీఎంగా ఎస్ జె సూర్య అద్దరగొట్టేసాడు. పాటల్లో కియారా అందాలు, సాంగ్స్ విజువల్స్ ముఖ్యంగా థమన్ BGM గేమ్ ఛేంజర్ ట్రైలర్ కి వేరే లెవల్ ఎక్స్పీరియన్స్ అంటూ ఆడియన్స్ మాట్లాడుతున్నారు. ఇక మరో హీరోయిన్ అంజలి చరణ్ వైఫ్ గా సాదా సీదాగా కనిపించింది, శంకర్ భారీ మేకింగ్, దిల్ రాజు ప్రొడక్షన్ వాల్యూస్ అన్ని గేమ్ ఛేంజర్ ట్రైలర్ కి హైలెట్స్ గా నిలుస్తున్నాయి.