మహానటి కీర్తి సురేష్ తన చిన్ననాటి స్నేహితుడు ఆంటోనీని డిసెంబర్ 12 న గోవాలో ప్రేమ వివాహం చేసుకుంది. ఎప్పటినుంచో కీర్తి సురేష్ తన చిన్నప్పటి ఫ్రెండ్ ని పెళ్లి చేసుకోబోతుంది అనే వార్త ఉంది, వారిద్దరూ చిన్నప్పటి నుంచే స్కూల్ మేట్స్ అంటూ చెప్పారు. కానీ వీరి ప్రేమ ఎలా మొదలైంది, ఆ ప్రేమ పెళ్లి వరకు ఎలా దారి తీసింది అనే ముచ్చట బొత్తిగా తెలియదు.
తాజాగా కీర్తి సురేష్ తన లవ్ స్టోరీని బయటపెట్టింది. తాను ఆంటోనీతో 12వ తరగతిలోనే ప్రేమలో పడ్డానని, తమ ప్రేమకు 15 ఏళ్ళు, 2010 లో ఆంటోని నాకు ప్రపోజ్ చేసాడు, ఆంటోనీ నా కంటే ఏడు సంవత్సరాలు పెద్దవాడు, ఒకసారి తాను తన కుటుంబంతో కలిసి ఓ రెస్టారెంట్ కు వెళ్లగా, అక్కడికి ఆంటోనీ కూడా వచ్చాడు, ఆంటోనీ తనకు స్కూల్ మెట్ అని, ఆ పరిచయంతో పిలవగానే తన దగ్గరికి వెళ్ళానని చెప్పింది.
అయితే 2010 లో ఆంటోని ప్రపోజ్ చేసినా చాలా రోజులు తాము స్నేహితులుగానే ఉన్నామని, 2016 నుండి తమ బంధం మరింత బలపడిందని, అప్పుడే ఆంటోనీ తనకు రింగును బహుమతిగా ఇచ్చాడని చెప్పిన కీర్తి సురేష్ తమ బంధం పబ్లిక్ గా తెలియనుకోలేదు, తమ బంధాన్ని సీక్రెట్ గా ఉంచాలనుకున్నాము. అందుకే ఎవరి కంట పడలేదు.
2017లో తామిద్దరం కలిసి ఫారిన్ ట్రిప్ కు వెళ్లామని, 2022లో పెళ్లి చేసుకుందామని నిర్ణయించుకున్నామని, అలా 2024 డిసెంబర్లో పెళ్లి చేసుకుని ఒకటయ్యామని చెప్పిన కీర్తి సురేష్ తమ పెళ్లి ఇప్పటికి కలగానే ఉంది అంటూ షాకింగ్ ఎక్స్ప్రెషన్ ఇచ్చింది. ఇక పసుపు తాడుతో కనిపించడంపై రియాక్ట్ అయిన కీర్తి సురేష్ త్వరలోనే మంచి ముహూర్తం చూసి పసుపుతాడుని బంగారు గొలుసుగా మార్చుకుంటాను అని చెప్పింది.