మహేష్ బాబు తన సినిమా ఓపెనింగ్స్ కి వెళ్లరు అనే విషయం తెలిసిందే. మహేష్ తన భార్య ని పిల్లలను సినిమా పూజా కార్యక్రమాలకు పంపిస్తారు. ఆతర్వాత మహేష్ రెగ్యులర్ షూటింగ్ వెళ్ళిపోతారు. కొన్నాళ్లుగా మహేష్ ఈ సెంటిమెంట్ ని నమ్ముతున్నారు.
కానీ నేడు రాజమౌళి తో చెయ్యబోయే మూవీ ఓపెనింగ్ కి మహేష్ హాజరవ్వడం చూసి మహేష్ రాజమౌళి కోసం సెంటిమెంట్ బ్రేక్ చేసాడు అనే మాట సోషల్ మీడియాలో వినిపిస్తోంది. మహేష్ ఇంటి నుంచి ఆయన కారు బయటికి రావడం, రాజమౌళి ఫ్యామిలీ మహేష్ మూవీ ఓపినింగ్ లో కనిపించరు తప్ప మహేష్ ఈ ఓపెనింగ్ కి వెళ్లినట్టుగా అఫీషియల్ గా బయటికి రాలేదు. అసలు మహెష్ కనిపించలేదు.
అయినప్పటికీ SSMB 29 పూజలో మహేష్ పాల్గొన్నట్లుగా తెలుస్తుంది. అది చూసి రాజమౌళి కోసం ఏమైనా చెయ్యాల్సిందే. అంటే హీరోలు రాజమౌళి సినిమా కోసం సెంటిమెంట్స్ పక్కనపెట్టాల్సిందే అంటూ నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఇక రాజమౌళి తో మూవీ ముగిసేసరికి మహేష్ లో ఇంకెన్ని మార్పులు చూస్తామో అని ఆయన అభిమానులే మాట్లాడుకుంటున్నారు.