గత రెండేళ్లలో పూజ హెగ్డే పేరు ఏ సినిమా లోను వినిపించలేదు. పలు భాషల్లో వరసగా నిరాశపరిచే సినిమాలతో ఉన్న పూజ హెగ్డే ను చాలా రోజుల పాటు ఎవరూ కన్సిడర్ చెయ్యలేదు. దానితో పూజ హెగ్డే గత రెండేళ్లలో ఎక్కువగా ఖాళీగానే కనబడింది. కానీ ఈ ఏడాది అంటే 2025 లో మాత్రం హెగ్డే టైమ్ స్టార్ట్ అయినట్లే కనిపిస్తుంది.
కారణం కోలీవుడ్ లో పూజ హెగ్డే కు ఏకంగా స్టార్ హీరోల సినిమాల్లో అవకాశాలొచ్చాయి. అందులో సూర్య సరసన రెట్రో చిత్రంలోనూ, మరొకటి స్టార్ హీరో విజయ్ చివరి సినిమాలో పూజ హెగ్డే నే హీరోయిన్. మరోపక్క రాఘవ లారెన్స్ కాంచన సీక్వెల్ లోను పూజ హెగ్డే నే హీరోయిన్ అనుకుంటున్నారు.
అందుకే 2025 ఏడాది పూజ హెగ్డే కు స్పెషల్ కాబోతుంది. న్యూ ఇయర్ కి పూజ హెగ్డే సముద్రపు ఒడ్డున సరదాగా గడుపుతూ ఈ ఏడాదికి గ్రాండ్ వెల్ కమ్ చెప్పింది. పూజ హెగ్డే న్యూ ఇయర్ లుక్ మాత్రం బ్రైట్ గా అదిరిపోయింది అనే చెప్పాలి.