రామ్ చరణ్ నటించిన గేమ్ ఛేంజర్ ట్రైలర్ మరికాసేపట్లో రాబోతుంది ఈ రోజు రాజమౌళి చేతుల మీదుగా గేమ్ చెంజర్ ట్రైలర్ లాంచ్ జరగబోతుంది. అయితే గేమ్ ఛేంజర్ మూడు భాషల్లో విడుదలవుతుంది. తెలుగు, తమిళ, హిందీ భాషల్లో గేమ్ చెంజర్ విడుదలకు రెడీ అవుతుంది. జనవరి 10 న రిలీజ్ అవ్వబోతున్న గేమ్ చెంజర్ ప్రమోషన్స్ విషయంలో మెగా ఫ్యాన్స్ చాలా అసంతృప్తిగా ఉన్నారు.
పాన్ ఇండియా మూవీ, ఇంకా విడుదలకు వారం రోజుల సమయమే ఉంది. కానీ ప్రమోషన్స్ మాత్రం చాలా చప్పగా ఉన్నాయి. టీజర్ లాంచ్, ప్రీ రిలీజ్ ఈవెంట్ అంటూ అక్కడెక్కడో చేసేసి ఇక్కడ ఇంటర్వూస్ లాంటివేమీ చెయ్యడం లేదు, తెలుగులో రాజమండ్రిలో ప్రీ రిలీజ్ ఈవెంట్ అంటున్నారు, మరి చెన్నై లో గేమ్ ఛేంజర్ ఈవెంట్ పరిస్థితి ఏమిటి.
దిల్ రాజు సంక్రాంతికి వస్తున్నామంటూ ఆ మూవీ ప్రమోషన్స్ లో ఉన్నారు, గేమ్ చెంజర్ విషయంలో ఆయన లైట్ గా ఉండడాన్ని మెగా ఫ్యాన్స్ భరించలేకపోతున్నారు. పుష్ప 2తో అల్లు అర్జున్ ప్రమోషన్స్ ఎలా చేసాడో చూసారా, మా రామ్ చరణ్ ని ఏం చేద్దామనుకుంటున్నారు అంటూ మెగా అభిమానులు అసంతృప్తిగా కనబడుతున్నారు.
మరి కాసేపట్లో రాబోయే గేమ్ ఛేంజర్ ట్రయిలర్ ఎలా ఉండబోతుందో అని వారు ఆతృతగా ఎదురు చూస్తున్నారు.