ఈసారి మెగా ఫ్యామిలిలో క్రిస్టమస్ సెలబ్రేషన్స్ కానీ, న్యూ ఇయర్ పార్టీ కానీ జరగలేదు, మెగా ఫ్యామిలీ-అల్లు ఫ్యామిలీ కలిసి చేసుకునే ఈ సెలబ్రేషన్స్ ను ఈసారి రెండుకుటంబాల వారు స్కిప్ చేసారు. కారణం అల్లు అర్జున్ సంధ్య థియేటర్ కేసు విషయంలో సఫర్ అవడంతో మెగా ఫ్యామిలిలో ఎలాంటి సెలబ్రేషన్స్ నిర్వహించలేదు.
మరి న్యూ ఇయర్ పార్టీ ఇంట్లో జరుపుకోకపోతేనేమి.. మెగా కజిన్స్ అంతా ఈసారి తాపేశ్వర్ లో తేలారు. వరుణ్ తేజ్ తో కలిసి ఆయన భార్య లావణ్య, చెల్లెలు నిహారిక, మెగాస్టార్ కుమార్తెలు సుష్మిత, శ్రీజలు అంతా కలిసి 2025 కి వెల్ కమ్ చెప్పేందుకు తాపేశ్వర్ వెళ్లారు. అక్కడ వెకేషన్స్ ను ఎంజాయ్ చేస్తూ మెగా కజిన్స్ సందడి చేసారు.
అయితే ఈ న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ లో అల్లు అర్జున్ కానీ, రామ్ చరణ్ కానీ కనిపించలేదు. కేవలం వరుణ్ ఇంకా మెగా సిస్టర్స్ గ్యాంగ్ మాత్రమే కనిపించింది.