Advertisementt

ఎన్నిరోజులు సుధీర్-రష్మీ ని వాడతారు

Thu 02nd Jan 2025 10:59 AM
e sankranthiki vasthunam  ఎన్నిరోజులు సుధీర్-రష్మీ ని వాడతారు
How many days Sudheer-Rashmi is used ఎన్నిరోజులు సుధీర్-రష్మీ ని వాడతారు
Advertisement
Ads by CJ

ఈటీవీలో గత పదేళ్లుగా సుడిగాలి సుధీర్-యాంకర్ రష్మిని పెయిర్ అప్ చేసి ఎన్నో ప్రోగ్రామ్స్ చేసారు. వారిద్దరూ ప్రేమలో ఉన్నట్లుగా ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీతో బుల్లితెర ప్రేక్షకులను మెస్మరైజ్ చేసారు. ఈటీవీలో జబర్దస్త్ లోనే కాదు ప్రతి ఫెస్టివల్ ప్రోగ్రాం లో సుధీర్-రష్మీ జంటగా హైలెట్ అయ్యేవారు. 

రెండేళ్ల ముందు సుధీర్ ఈటివి నుంచి తప్పుకున్నాడు. జబర్దస్త్ వదిలేసి హీరోగా వెండితెర మీద ట్రై చేస్తున్నాడు. అప్పుడప్పుడు అంటూ ఏ ఫెస్టివల్ కో యాంకర్ గా వస్తున్నాడు.. తప్ప ఈటీవీలో సుధీర్ ఒక్కప్పడు కనిపించినట్టుగా కనిపించడం లేదు. ఇక సుధీర్ - రష్మీ లు కేవలం ఆన్ స్క్రీన్ లవర్స్ మాత్రమే ఆఫ్ స్క్రీన్ లో వీరిద్దరూ మంచి ఫ్రెండ్స్. 

అయితే రష్మీ-సుధీర్ పెయిర్ గత రెండేళ్లుగా కనిపించలేదు, అందరూ ఈ పెయిర్ ని మరిచిపోతున్న సమయంలో ఈ సంక్రాంతికి వస్తునన్నాం అంటూ మరోసారి సుధీర్-రష్మీ పెయిర్ తో ఫెస్టివల్ ప్రోగ్రాం ను ఈటివి వారు డిజైన్ చేసారు. అదే ఈవెంట్ లో సుధీర్-రష్మిలు తండేల్ చిత్రంలోని బుజ్జి తల్లి సాంగ్ లో రొమాంటిక్ గా రెచ్చిపోయారు. 

ప్రస్తుతం ఈ సంక్రాంతికి వస్తునన్నాం అంటూ వచ్చిన ఫెస్టివల్ ప్రోమో చూసి ఇంకెన్నాళ్లు రష్మిని సుధీర్ ని వాడతారంటూ నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు. 

How many days Sudheer-Rashmi is used:

E Sankranthiki Vasthunam Latest Teaser

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ