గత 2024 ఏడాది అంటే హీరో సిద్దార్థ్-హీరోయిన్ అదితి రావు కి చాలా స్పెషల్. వారు చాన్నాళ్లుగా డేటింగ్ లో ఉన్నా 2024 లోనే ఎంగేజ్మెంట్ చేసుకుని పెళ్లి కూడా అదే ఏడాది చేసుకున్నారు. తెలంగాణలోని వనపర్తిలో పురాతన టెంపుల్ లో వీరి ఎంగేజ్మెంట్, పెళ్లి అన్ని చాలా సింపుల్ గా సీక్రెట్ గానే జరిగాయి.
అయితే వీరిలో ముందుగా అదితి ప్రపోజ్ చేసిందా, లేదంటే సిద్దార్థ్ అదితిని పడేశాడా, ఎవరు ఎవరికి ప్రపోజ్ చేశారనే విషయంలో వాళ్ళ అభిమానుల్లో చాలా క్యూరియాసిటీ ఉంది. తాజాగా అంటే న్యూ ఇయర్ స్పెషల్ గా అదితి తమ పెళ్లి ఫోటో ని అలాగే ఓ స్పెషల్ వీడియో ని సోషల్ మీడియాలో షేర్ చేసింది.
గత ఏడాది లో తమ మధుర జ్ఞాపకాలతో కూడిన వీడియో అది. అందులో సిద్దార్థ్ అదితికి ప్రపోజ్ చేసిన పిక్ ని, సిద్దార్థ్ తో గడిపిన క్షణాలతో పాటుగా ఎంగేజ్మెంట్, పెళ్లి ఫొటోస్ ని షేర్ చేసింది. అందులో సిద్దు అదితికి ప్రపోజ్ చేస్తున్న పిక్ మాత్రం అందరిని ఆకట్టుకుంది.