Advertisementt

రామ్ చరణ్ కి దారిచ్చిన అజిత్

Wed 01st Jan 2025 01:47 PM
vidaamuyarchi  రామ్ చరణ్ కి దారిచ్చిన అజిత్
Vidaamuyarchi out of Pongal race రామ్ చరణ్ కి దారిచ్చిన అజిత్
Advertisement
Ads by CJ

ఈ సంక్రాంతి కి గేమ్ ఛేంజర్ తో రామ్ చరణ్ జనవరి 10 న పాన్ ఇండియా ఆడియన్స్ ముందుకు రాబోతుంది. అదే రోజు తమిళం నుంచి అజిత్ కుమార్ విడాముయర్చి విడుదల కాబోతుంది. దానిలో కోలీవుడ్ లో అజిత్ నుంచి చరణ్ కు గట్టి పోటీ ఉంటుంది, పొంగల్ ఫైట్ లో గేమ్ ఛేంజర్ తమిళ ఓపెనింగ్స్ పై అజిత్ విడాముయర్చి ఎఫెక్ట్ ఉంటుంది అని మెగా ఫ్యాన్స్ ఆందోళనపడ్డారు. 

అయితే తాజాగా అజిత్ విడాముయర్చి చిత్రం పొంగల్ రేస్ నుంచి తప్పుకుంటుంది అనే వార్త చూసి మెగా అభిమానులు రిలాక్స్ అవుతున్నారు. అజిత్ మూవీ తప్పుకోవడంతో ఇప్పుడు గేమ్ ఛేంజర్ కి అటు తమిళనాటే కాదు, ఇటు తెలుగులోనూ ఎదురు లేకుండా పోయింది. కొన్నాళ్లుగా అజిత్ కి తెలుగులో హిట్ లేకపోయినా ఆయన సినిమా అంటే మొదటి రోజు ఆడియన్స్ లో క్యూరియాసిటీ ఉంటుంది. 

మరి ఈ పొంగల్ కి తెలుగులోనే భారీ ఫైట్ నడుస్తుంది. గేమ్ ఛేంజర్ 10న, 12 న డాకు మహారాజ్ విడుదలవుతుంది, ఆ తర్వాత రెండు రోజులకు అంటే జనవరి 14 న వెంకీ సంక్రాంతికి వస్తున్నాం చిత్రాలు విడుదలవుతున్నాయి. 

Vidaamuyarchi out of Pongal race:

Why Did Ajith Vidaamuyarchi Backed Out Of Pongal Race

Tags:   VIDAAMUYARCHI
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ