అక్కినేని అఖిల్ ఈ ఏడాది పెళ్లి చేసుకోబోతున్నాడు. గత ఏడాది డిసెంబర్ లో అఖిల్ అక్కినేని జైనబ్ రవ్జీ తో ఎంగేజ్మెంట్ చేసుకున్న విషయం తెలిసిందే. ఈ ఏడాది అఖిల్- జైనబ్ రవ్జీ పెళ్లి పీటలెక్కబోతున్నారు. కొన్నాళ్లుగా ప్రేమలో ఉన్న అఖిల్- జైనబ్ రవ్జీ లు పెళ్లి కి సిద్ధం అవుతున్నారు.
నాగ చైతన్య -శోభిత ల వివాహంలో అఖిల్ జైనబ్ రవ్జీ లు సందడి చేసిన ఫొటోస్ వైరల్ అవ్వగా.. నేడు న్యూ ఇయర్ కి అఖిల్ కు కాబోయే భార్య జైనబ్ రవ్జీ తో కలిసి సెలెబ్రేట్ చేసుకున్న పిక్ ఇపుడు నెట్టింట సంచలనంగా మారింది. నాగార్జున శోభిత ను పెద్ద కోడలిగా ఆహ్వానించారు.
ఇప్పుడు జైనబ్ రవ్జీ చిన్న కోడలుగా ఆహ్వానించేందుకు వెయిట్ చేస్తున్నారు. అఖిల్ జైనబ్ రవ్జీ ల వివాహం నాగార్జున మార్చ్ లో నిర్వహించే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది.