గ్లోబల్‌స్టార్ రామ్ చరణ్ భారీ పాన్ ఇండియా మూవీ గేమ్ చేంజర్ కి కౌంట్ డౌన్ షురూ అయ్యింది. మాస్టర్ ఫిల్మ్ మేకర్ శంకర్ ఈ పొలిటికల్ యాక్షన్ డ్రామాను తెరకెక్కించారు. సినిమాపై అంచనాలు రోజు రోజుకీ పెరుగుతున్నాయి. మెగాభిమానులు, ప్రేక్షకులు సినిమాను ఎప్పుడెప్పుడు చూద్దామా! అని ఎగ్జయిట్‌మెంట్‌తో వెయిట్ చేస్తున్నారు. ఈ ఎగ్జయిట్‌మెంట్‌ను నెక్ట్స్ రేంజ్‌కు తీసుకెళ్లే కార్యక్రమానికి చిత్ర యూనిట్ శ్రీకారం చుట్టింది. అందులో భాగంగా జనవరి 2న గేమ్ చేంజర్ ట్రైలర్‌ను విడుదల చేసి న్యూ ఇయర్ ట్రీట్‌ను అందించటానికి సిద్ధమైంది.
ఇప్పటి వరకు గేమ్ చేంజర్ నుంచి వచ్చిన సాంగ్స్, టీజర్, పోస్టర్స్, ప్రమోషనల్ కంటెంట్‌తో ఎక్స్‌పెక్టేషన్స్ పీక్స్‌కి చేరుకున్నాయి. ఇప్పుడు ట్రైలర్ కోసం అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. స్టార్ డైరెక్టర్ శంకర్ ప్రపంచంలో గ్లోబల్ స్టార్ ఎలా ఉంటాడో చూడాలని అందరూ వెయిట్ చేస్తున్నారు. ఈ సినిమా ట్రైలర్ అంచనాలను అందుకుని ప్రేక్షకులను మెప్పిస్తుందని మేకర్స్ భావిస్తున్నారు.
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్.. గేమ్ చేంజర్ చిత్రంలో రెండు పవర్‌ఫుల్ పాత్రల్లో మెప్పించనున్నారు. కియారా అద్వానీ హీరోయిన్‌గా నటించగా, అంజలి, ఎస్.జె.సూర్య, శ్రీకాంత్, సముద్రఖని, సునీల్, నవీన్ చంద్ర తదితరులు ఇతర కీలక పాత్రల్లో నటించారు.