టాలీవుడ్ లో అసలు సిసలు మల్టీస్టారర్ అంటే ఆర్.ఆర్.ఆర్. రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్-రామ్ చరణ్ కలిసి చేసిన ఈ చిత్రం ఆస్కార్ వరకు వెళ్ళింది. అలాంటి మల్టీస్టారర్ లు నార్త్ లో చాలా కనిపిస్తూ ఉంటాయి. అక్కడి స్టార్ హీరోలు ఎలాంటి ఈగోస్ పెట్టుకోకుండా వేరే హీరోల సినిమాల్లో గెస్ట్ రోల్స్ కూడా ప్లే చేస్తారు.
తాజాగా రామ్ చరణ్ ను ఏ హీరోతో మల్టీస్టారర్ చెయ్యాలని ఉంది అని అడిగితే సూపర్ స్టార్ మహేష్ తో స్క్రీన్ షేర్ చేసుకోవాలనుంది అంటూ బాక్సులు బద్దలయ్యే కామెంట్స్ చేశారు చరణ్. అది ఎక్కడో తెలుసా.. నందమూరి బాలకృష్ణ హోస్ట్ చేస్తున్న ఆహా అన్ స్టాపబుల్ టాక్ షోలో బాలయ్య చరణ్ తో కలిసి ఆడుకున్న తీరు సోషల్ మీడియా లో పిక్స్ రూపంలో వైరల్ అవుతున్నాయి.
ఈ షో లో బాలయ్య రామ్ చరణ్ ను మరో మల్లీస్టారర్ చెయ్యాల్సి వస్తే ఏ హీరోని ఎంచుకుంటావని అడగగా దానికి రామ్ చరణ్ రామ్ చరణ్ తో చేస్తాను అని చెప్పినట్లుగా సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. మరి మహేష్-చరణ్ మంచి ఫ్రెండ్స్, వీరు కలిసి స్క్రీన్ మీద కనిపిస్తే రికార్డులు బద్దలవడం ఖాయమని వాళ్ళ అభిమానులు ఫీలవుతున్నారు.