2024 ఎన్నికల రిజల్ట్ తర్వాత వైసీపీ ని వదిలి పార్టీ మారె ఆలోచనలో ఉన్న నేతలు బలమైన టీడీపీ లో చేరేందుకు ఇంట్రెస్ట్ చూపించడం లేదు, వైసీపీ పార్టీని వదిలేసే వారు ఎక్కువగా పవన్ కళ్యాణ్ స్తాపించిన జనసేన వైపు మొగ్గు చూపుతున్నారు. టీడీపీ లో చేరితే ప్రాధాన్యత ఉండదు, అక్కడి సీనియర్ నాయకులతో కలిసి పని చేసినా ప్రయోజనం ఉండదు.
అందుకే వైసీపీ నుంచి వచ్చే నేతలంతా బలమైన నాయకులు లేని జనసేనను ఎంచుకుంటున్నారు తప్ప.. పవన్ పై ప్రేమ ఉండి కాదు, ఆయనపై నమ్మకంతోనూ కాదు అనేది టీడీపీ అభిమానుల మాట. జనసేనలో చేరితే అక్కడ ప్రాముఖ్యత దొరుకుతుంది. పవన్ తర్వాత స్థానం కోసం పోటీపడొచ్చు.
జనసేనలో బలమైన నాయకులుగా మారి చక్రం తిప్పొచ్చు అనేది వారి ప్లాన్. అదే చంద్రబాబు ఉన్న టీడీపీ లో చేరితే లోకేష్ కి సమాధానం చెప్పాలి, అలాగే ఇంకా బలమైన అచ్చెన్నాయుడు లాంటి నేతలను దాటి వెళ్లడం అసాధ్యం. కాబట్టే జనసేనలో చేరితే 2029 నాటికీ ఆ పార్టీ నిండు కుండలా మారి సింగిల్ గా పోటీ చేస్తే అయినా తమకు పదవులు దక్కుతాయని ఆశపడి వైసీపీ నుంచి వచ్చేవారు ఎక్కువగా జనసేనవైపు చూస్తున్నారు.
చంద్రబాబు కాన్నా పవన్ కళ్యాణ్ బలమైన నేత అని కాదు, అలాగని వేరే ఇతర కారణాలతో జనసేనలో చేరడం లేదు, టీడీపీ లో కన్నా అక్కడైతే గౌరవం దక్కుతుంది అని వైసీపీ నేతలు చాలామంది జనసేన కండువా కప్పుకుంటున్నారు. ఇదన్నమాట అసలు సంగతి.