యాంకర్ అనసూయ ప్రస్తుతం ఫ్యామిలీతో తీరిగ్గా టైమ్ స్పెండ్ చేస్తుంది. వరస షూటింగ్స్ తో ఉక్కిరి బిక్కిరి అవుతూ ఫ్యామిలీకి సమయాన్ని కేటాయించలేకపోవడంతోనే అనసూయ జబర్దస్త్ నుంచి తప్పుకుంది. ఈ మధ్యన కేవలం సినిమా షూటింగ్స్, బుల్లితెర పై ఏదైనా షోస్ కి జెడ్జి గా కనబడుతున్న అనసూయ సమయం దొరికినప్పుడు, కొడుకులకు సెలవలొచ్చినప్పుడు ఫ్యామిలీతో కలిసి వెకేషన్స్ కి వెళ్ళిపోతుంది.
ఇప్పుడు కూడా అనసూయ 2024 కి గుడ్ బై చెబుతూ.. 2025 కి గ్రాండ్ వెల్ కమ్ చెప్పేందుకు ఫ్యామిలీతో కలిసి వెకేషన్ కి వెళ్ళింది. డే 1, డే 2 అంటూ సరదాగా ఫొటోస్ ని పోస్ట్ చేస్తుంది. భర్త భరద్వాజ్, పిల్లలతో కలిసి అనసూయ న్యూ ఇయర్ సెలెబ్రేషన్స్ ని గ్రాండ్ గా చేసుకుంటుంది.
అందుకు నిదర్శనమే ఆమె పోస్ట్ చేస్తున్న పిక్స్. మీరు కూడా అనసూయ న్యూ ఇయర్ సెలెబ్రేషన్స్ పిక్స్ పై ఓ లుక్ వెయ్యండి.