యంగ్ హారో నితిన్ కరోనా సమయంలో ఎలాంటి అంటే ప్రముఖులనెవరిని పిలకుండానే ప్రేమించిన షాలిని కందుకూరిని రాయల్ వెడ్డింగ్ చేసుకున్నాడు. పెళ్లి తర్వాత నితిన్ సినిమాలు చేసుకుంటూ బిజీగా వున్నాడు. ఆ మధ్యలో నితిన్ వైఫ్ షాలిని ప్రెగ్నెంట్ అనే వార్తలు వైరల్ అయ్యాయి.
షాలిని మాత్రం 2024 లో ప్రెగ్నెంట్ అయ్యింది. ఆ విషయాన్ని నితిన్ సోషల్ మీడియా ద్వారా అనౌన్స్ చేసాడు. నితిన్ కి వారసుడు ఎప్పుడు వస్తాడా అని ఆయన అభిమానులు ఎదురు చూడని రోజు లేదు. 2024 కి గూడి బై చెబుతూ నితిన్ తన భార్య షాలిని తో కలిసి చేయించుకున్న మెటర్నిటీ ఫోటో షూట్ పిక్స్ వదిలాడు.
2025 కి వెల్ కమ్ చెబుతో వారసుడు రాక కోసం వెయిట్ చేస్తున్న ఈ జంటకు అందరూ శుభాకాంక్షలు చెబుతున్నారు. ప్రస్తుతం నితిన్ తన భార్య శాలినితో దిగిన పిక్స్ వైరల్ అయ్యాయి. ఇక నితిన్ నటించిన రాబిన్ హుడ్ విడుదలకు సిద్ధమవుతుండగా, తమ్ముడు సెట్స్ మీదుంది.