Advertisementt

సంక్రాంతి సినిమాలకు గుడ్ న్యూస్

Tue 31st Dec 2024 10:42 PM
ap  సంక్రాంతి సినిమాలకు గుడ్ న్యూస్
Good news for Sankranti movies సంక్రాంతి సినిమాలకు గుడ్ న్యూస్
Advertisement
Ads by CJ

న్యూ ఇయర్ వచ్చేసింది. మరో పది రోజుల్లో సంక్రాంతి పండుగ కూడా వచ్చేస్తుంది. అంటే కొత్త సినిమాలు, భారీ బడ్జెట్ సినిమాలకు స్వాగతం పలికేందుకు ప్రేక్షకులు రెడీ అవ్వలిగా, మేకర్స్ కు కాసుల పంట కురిపించే సీజన్ సంక్రాంతి. అందుకే రామ్ చరణ్ తన గేమ్ ఛేంజర్ ని, బాలయ్య డాకు మహారాజ్ ని, వెంకీ సంక్రాంతికి వస్తున్నాం ను ఈ సంక్రాంతికి విడుదల చేస్తున్నారు. 

మూడు సినిమాలు మూడు డిఫ్రెంట్ స్టోరీస్ తో ప్రేక్షకులను సర్ ప్రైజ్ చెయ్యబోతున్నాయి. అయితే తెలంగాణ లో బెన్ఫిట్ షోస్, టికెట్ రేట్స్ హైక్ ఉండవని రేవంత్ రెడ్డి ప్రభుత్వం తేల్చి చెప్పెయ్యడంతో.. ఇప్పుడు అందరి కన్ను ఏపీ పై పడింది. మరి పెద్ద సినిమాలకు టికెట్ రేట్స్ పెంచుకునే వెసులుబాటు ఇస్తేనే నిర్మాతలు సేఫ్ అవుతారు. 

ఏపీలో కూటమి ప్రభుత్వం సంక్రాంతి సినిమాలకు స్వీట్ న్యూస్ అందించింది. అందులో చరణ్ గేమ్ ఛేంజర్ చిత్రానికి సింగిల్ స్క్రీన్ థియేటర్లలో రూ.135, మల్టీప్లెక్స్‌లలో రూ.175 మేర టికెట్ రేట్లు పెంచుకునేందుకు అనుమతి లభించింది. అంతేకాకుండా గేమ్ ఛేంజర్  బెనిఫిట్ షో టికెట్ రేట్లు రూ.600కు పెంచుకునే అనుమతి లభించింది. 

ఇక బాలయ్య డాకు మహారాజ్ చిత్రానికి సింగిల్ స్క్రీన్స్‌లో రూ.110, మల్టీప్లెక్స్‌లలో రూ.135 పెంపుకు అనుమతినిచ్చారు.డాకు మహారాజ్ బెనిఫిట్ షోకు రూ.500 మేర పెంపుకు అనుమతినిచ్చారు. వెంకటేష్ సంక్రాంతికి వస్తున్నాంకి సింగిల్ స్క్రీన్స్‌లో రూ.75, మల్టీప్లెక్స్‌లలో రూ.100 పంచుకునే అనుమతులు వచ్చాయి. 

Good news for Sankranti movies:

AP Govt Allows Extra Shows And Ticket Rates Hike For Sankranthi Releases

Tags:   AP
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ