గత వారం మంచు ఫ్యామిలీలోని ఆస్తి పంపకాల రచ్చ మీడియాలో ఎంతగా హాట్ టాపిక్ అయ్యిందో అందరూ చూసారు. ఈ వివాదంలో మోహన్ బాబు, విష్ణు ఓ వైపు, మంచు మనోజ్ ఓ వైపు. వారి నడుమ ఆస్తి తగాదాలు ఓ రేంజ్ లో రచ్చకెక్కాయి. ఈ వివాదంలో మోహన్ బాబు మీడియా జర్నలిస్ట్ పై చేయి చేసుకోవడం ఆతర్వాత బెయిల్ రాకపోవడంతో ప్రస్తుతం ఆయన అజ్ఞాతంలో ఉన్నారు.
ఇక విష్ణు పై ఏ పోస్ట్ పెట్టడానికి వీలు లేదు అని కోర్టు మనోజ్ ని హెచ్చరించడంతో ఈ గొడవ సద్దుమణిగింది అనుకున్నారు. కానీ తాజాగా మంచు వివాదంలో మరో వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
మంచు విష్ణు సిబ్బంది మరో వివాదంలో చిక్కుకున్నారు, విష్ణు సిబ్బంది జల్ పల్లి లోని అడవిలో వేట కొనసాగించిన వీడియో వైరల్ అయ్యింది. జల్ పల్లి లోని అడవిలో అడవి పందులను వేటాడిన విష్ణు సిబ్బంది, చిట్ట అడవిలోకి వెళ్లి అడవి పందులను వేటాడి తీసుకువెళ్లిన మేనేజర్ కిరణ్. ఆ వేటాడిన అడవి పందిని బంధించి తీసుకువెళ్లిన ఎలక్ట్రిషన్ దేవేంద్ర ప్రసాద్.
మేనేజర్ కిరణ్, ఎలక్ట్రిషన్ దేవేంద్ర ప్రసాద్ ఇద్దరి చర్యలను తప్పుపడుతూ మంచు మనోజ్ పలుమార్లు అభ్యంతరం చెప్పినా విళనలేదట. అడవిలోకి వెళ్లి పందులను వేటాడొద్దని హెచ్చరించిన పట్టించుకోని మేనేజర్, ఎలక్ట్రిషన్. ఇపుడు అడవి పందులను బంధించి తీసుకెళ్తున్న వీడియోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టడంతో అడవి పందులను వేటాడిన వారిపై చర్యలు తీసుకోవాలని నెటిజెన్స్ డిమాండ్ చేస్తున్నారు.