హరీష్ శంకర్ ఏదైనా సినిమాని రీమేక్ చేస్తున్నప్పుడు కేవలం నటులనే కాదు, స్టోరీ ని కూడా చాలావరకు మార్చేసి తన స్టయిల్లో సినిమాని తెరకెక్కించి ప్రేక్షకుల చేత శెభాష్ అనిపించుకున్న సందర్భాలు ఉన్నాయి. కానీ తమిళంలో హిట్ అయిన తేరి రీమేక్ ని పవన్ తో హరీష్ మొదలు పెడుతున్నాడు అనగానే హరీష్ శంకర్ పై విపరీతమైన ట్రోలింగ్ నడిచింది.
అయినప్పటికీ హరీష్ శంకర్ వెనక్కి తగ్గలేదు, ఉస్తాద్ భగత్ సింగ్ సెట్స్ మీదకి తీసుకేళ్లడమే తరువాయి.. ఫస్ట్ లుక్స్ తో పవన్ ఫ్యాన్స్ ను కూల్ చేసేసారు, ఉస్తాద్ భగత్ సింగ్ గ్లిమ్ప్స్ తో పవన్ ఫ్యాన్స్ నోరు మూయించడమేకాదు అనుమానాల్ని తుడిచేసాడు. అంతా ఓకె కానీ పవన్ రాజకీయాల వెంట పరుగులు తీసే క్రమంలో ఈ చిత్రాన్ని పక్కనెట్టేసారు.
అయితే హరీష్ శంకర్ తేరి రీమేక్ అయిన ఉస్తాద్ ప్రాజెక్ట్ పై ఇప్పటివరకు చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నాడు. కానీ బేబీ జాన్ రిజల్ట్ చూసాక చాలామంది హరీష్ శంకర్ కాన్ఫిడెంట్ ని దెబ్బతీసేలా మాట్లాడుతున్నారు. బేబీ జాన్ చూసాక హరీష్ ముఖ చిత్రం ఎలా ఉందో, హిందీలో బేబీ జాన్ కి వచ్చిన స్పందన తో హరీష్ ఏం చేస్తాడో అంటూ మాట్లాడుకుంటున్నారు.
మరొపక్కన పవన్ ఫ్యాన్స్ మళ్లీ హరీష్ శంకర్ ని సోషల్ మీడియాలో ఏసుకుంటున్నారు. మరి హరీష్ శంకర్ ఈ విషయంలో ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి.