Advertisementt

టాలీవుడ్ ను లైట్ తీసుకుంటున్న ఫహద్ ఫాసిల్

Tue 31st Dec 2024 10:22 AM
fahadh faasil  టాలీవుడ్ ను లైట్ తీసుకుంటున్న ఫహద్ ఫాసిల్
Fahadh Faasil is taking the light of Tollywood టాలీవుడ్ ను లైట్ తీసుకుంటున్న ఫహద్ ఫాసిల్
Advertisement
Ads by CJ

ఫహద్ ఫాసిల్ కి తెలుగు సినిమాలు చేసే ఇంట్రెస్ట్ లేదా, అందుకే ఆయన పుష్ప 2 ప్రమోషన్స్ లో పాల్గొనలేదా, ఫహద్ ఫాసిల్ కోలీవుడ్ పై చూపిస్తున్న ప్రేమ టాలీవుడ్ పై చూపించడం లేదా, ఆయనకు పుష్ప లో నటించడం ఇష్టం లేదా, అసలు పుష్ప 3 లో ఫహద్ ఫాసిల్ నటిస్తాడా ఇలా ఆయన అభిమానుల్లో ఎన్నో రకాల ప్రశ్నలు నడుస్తున్నాయి. 

తనకి కేరెక్టర్ నచ్చితే ఇతర హీరోలు అంటే రజినీకాంత్, కమల్ హాసన్ ఇలా స్టార్ హీరోల సినిమాల్లో నటించడానికి ఓకె చెప్పే ఫహద్ ఫాసిల్.. తెలుగు ని లైట్ తీసుకుంటున్నారా లేదంటే ఇక్కడి దర్శకనిర్మాతలు ఫహద్ ఫాసిల్ ని పట్టించుకోవడం లేదో ఏమో కానీ.. పుష్ప ద రూల్ తర్వాత ఆయనకు చాలా అవకాశాలొస్తాయని తెలుగు ప్రేక్షకులు ఎక్స్పెక్ట్ చేసారు. 

అసలు పుష్ప ద రూల్ ప్రమోషన్స్ లోనే కనిపించని ఫహద్, పుష్ప హిట్ ని కూడా పట్టించుకోలేదు, అయితే తెలుగు సినిమాలపై ఇంట్రెస్ట్ చూపించకపోవడానికి అసలు కారణం ఆయన ప్రస్తుతం మలయాళంలో చాలా బిజీగా వున్న హీరో. అందుకే ఆయనకు తెలుగు నుంచి ఆఫర్స్ వస్తున్నా రిజెక్ట్ చేస్తున్నారని తెలుస్తోంది. చూద్దాం ఫహద్ సైన్ చెయ్యబోయే ఆ తెలుగు ప్రాజెక్ట్ ఎప్పుడు, ఎలా ఉండబోతుంది అని.  

Fahadh Faasil is taking the light of Tollywood:

Fahadh Faasil is unhappy with his role in Pushpa 2

Tags:   FAHADH FAASIL
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ