గ్లోబల్ స్టార్ ఎన్టీఆర్ ప్రస్తుతం ఫ్యామిలీతో న్యూ ఇయర్ వేడుకల కోసం లండన్ వెళ్లారు. భార్య ప్రణతి, కుమారులు భార్గవ్ రామ్, అభయ్ రామ్ లతో కలిసి ఎన్టీఆర్ లండన్ లో ఎంజాయ్ చేస్తున్న వీడియోస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. దేవర బ్లాక్ బస్టర్ సక్సెస్ తర్వాత ఎన్టీఆర్ గ్యాప్ లేకుండా హిందీలో నటిస్తున్న వార్ 2 షూటింగ్లో పాల్గొంటున్నారు.
హృతిక్ రోషన్ హీరోగా అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో తెరకెక్కిస్తున్న హిట్ ఫ్రాంచైజీ వార్ 2 లో ఎన్టీఆర్ కీలక పాత్రలో కనిపిస్తున్నారు. ఈ చిత్రంలో ఎన్టీఆర్ కేరెక్టర్ డ్యూయెల్ షేడ్స్ కనిపిస్తుందట. అందులో ఒకటి దేశభక్తితో శత్రువు ఎంతటి వాడైనా సరే ఊచకోత కోసే ఇండియన్ ఆఫీసర్ గా ఉండగా.. ఇంకొకటి పైకి చెడు కనిపించినా లోపల ఎమోషనల్ ఉండే కేరెక్టర్ లో ఎన్టీఆర్ కనిపిస్తారట.
వార్ 2 కోసం ఎన్టీఆర్ సూపర్ మేకోవర్ అయ్యారు. చాలా సన్నగా హ్యాండ్ సం గా తయారయ్యారు, ఈ చిత్రంలో యాక్షన్ కోసం ఎన్టీఆర్ మాములుగా కష్టపడలేదు. హృతిక్-ఎన్టీఆర్ నడుమ వచ్చే యాక్షన్ సీక్వెన్స్ మాత్రమే కాదు, ఈ ఇద్దరి కలయికలో వచ్చే పాట అన్ని ఓ రేంజ్ లో ఉండబోతున్నాయనే న్యూస్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ కు కిక్ ఇచ్చింది.
ఈ చిత్రం లో కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తుంటే.. శ్రద్ద కపూర్ స్పెషల్ సాంగ్ లో కనిపించనుంది.