పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ తో రొమాన్స్ చేసే అవకాశం వస్తే ఏ హీరోయిన్ వదులుకుంటుంది. ఎగిరి గంతేసి మరీ ఒప్పేసుకుంటారు. తాజాగా ఓ హీరోయిన్ మాత్రం తనకు ప్రభాస్ తో సినిమా చేసే అవకాశం ఎప్పుడో వచ్చింది కానీ.. అప్పుడు వేరే సినిమాల కమిట్మెంట్స్ తో తాను ప్రభాస్ సినిమా చెయ్యలేకపోయాను అంటూ షాకింగ్ కామెంట్స్ చేసింది.
ఆమె ఎవరో కాదు.. ప్రభాస్ తో ప్రస్తుతం రాజా సాబ్ చిత్రంలో నటిస్తున్న మాళవిక మోహనన్. మాళవిక మోహనన్ ప్రభాస్ రాజా సాబ్ తో తెలుగులోకి ఎంట్రీ ఇస్తుంది. రాజా సాబ్ లో తన పాత్రపై ఫుల్ కాన్ఫిడెన్స్ చూపించే మాళవిక తాజాగా ప్రభాస్ తో తనకి గతంలోనే ఛాన్స్ వచ్చినా వదులుకున్నట్లుగా షాకింగ్ కామెంట్స్ చేసింది. అదేదో చిత్రం కాదు ప్రభాస్-ప్రశాంత్ నీల్ కాంబోలో బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచిన సలార్ చిత్రంలో మాళవిక మోహనన్ ను హీరోయిన్ గా అనుకుని ఆమెని సంప్రదించారట.
అప్పుడు ఆమెకి వేరే సినిమాలు ఉండి, డేట్స్ కుదరకపోవడంతోనే ఆ సినిమా చెయ్యలేకపోయాను అని ఈ ముద్దుగుమ్మ ఇప్పుడు బయటపెట్టింది. ప్రభాస్ తో తాను చేయాల్సిన మొదటి సినిమా అలాగే తెలుగులో కూడా తనకి అదే మొదటి చిత్రం కావాల్సింది అంటూ తానెలా ప్రభాస్ ఆఫర్ ని, బ్లాక్ బస్టర్ ని మిస్ అయ్యానో చెప్పుకొచ్చింది.