డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తాను నటిస్తున్న సినిమాలపై స్పందించారు. ఆయన నటిస్తున్న మూడు సినిమాలు సెట్స్ మీదున్నాయి. ప్రస్తుతం రాజకీయాలు, సినిమా షూటింగ్స్ తో చాలా బిజీగా వున్నారు. తాజాగా ఆయన నటించే సినిమాలపై క్రేజీ అప్ డేట్స్ ఇచ్చారు. నేను ఒప్పందం చేసుకున్న మూడు సినిమాలను టైం లోపు పూర్తి చెయ్యలేకపొయ్యారు.. ఓజి సినిమా కి నేనే కొంచం బాధ్యత తీసుకొని వర్క్ చెయ్యడం తో OG సినిమా పూర్తి అవ్వడానికి దగ్గరకొచ్చింది
అలాగే హరి హర విరమల్లు రెండు మూడు వారాల షూటింగ్ ఉంది అంటూ పవన్ OG, హరి హర వీరమల్లు, ఉస్తాద్ భగత్ సింగ్ పై మాట్లాడారు. అంతేకాకుండా OG సినిమా స్టోరీ1980,90s లో జరిగే కథ.. OG అంటే ఒరిజినల్ గ్యాంగ్ స్టర్, అభిమానులు ఎక్కడికి వెళ్లినా, OG OG అని అరుస్తున్నారు.. అవి నాకు బెదిరింపుల్లాగా అనిపిస్తున్నాయి..
అన్ని సినిమాలకి నేను డేట్స్ ఇచ్చాను, కానీ వారే సరిగా సద్వినియోగం చేసుకోలేదు, హరిహర వీరమల్లు ఎనిమిది రోజుల షూటింగ్ పెండింగ్ ఉంది.. అన్ని సినిమాలు ఒక్కొక్క దానిని వరసగా పూర్తి చేస్తాను అంటూ పవన్ కళ్యాణ్ తన సినిమాలపై అప్ డేట్ ఇవ్వడమే కాకుండా అభిమానులకు భరోసా ఇచ్చారు.