పవన్ కామెంట్స్ వెనుక దిల్ రాజు హస్తం!
బన్నీపై ఆగ్రహం.. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రశంసలు కురిపించడంపై సర్వత్రా చర్చ జరుగుతోంది. అసలు ఆయన ఎందుకు ఇలా మాట్లాడారు..? ఒకర్ని విమర్శించడం వల్ల ఆయనకు ఒరిగేదేమిటి..? బన్నీపై ఆయనకు ఇంకా కోపం తగ్గలేదా? అంటూ అభిమానులు, సినీ పెద్దలు, రాజకీయ ప్రముఖులు చర్చించుకుంటున్నారు. ఇదంతా గేమ్ చేంజర్ నిర్మాత, తెలంగాణ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ చైర్మన్ దిల్ రాజుతో ప్రోద్భలంతోనే మాట్లాడారా? అనే మాటలు వినిపిస్తున్నాయి. ఎందుకంటే ఈయనతో మీటింగ్ తర్వాత అల్లు అర్జున్ సంఘటనపై పవన్ మాట్లాడారు. దీంతో లేనిపోని అనుమానాలు వస్తున్నాయి. పోనీ పవన్ ఇలా మాట్లాడటం, దిల్ రాజు మాట్లాడించడం వల్ల ఎవరికేం లాభం అన్నది కూడా అర్థం కావట్లేదు.
ఎందుకనీ..?
సంధ్య థియేటర్ ఘటనపై ఇన్నిరోజులు స్పందించని పవన్ కళ్యాణ్ ఈరోజే ఎందుకు మాట్లాడారు? గతంలో ప్రతీ చిన్న సంఘటనలో ఇండస్ట్రీని ఎందుకు లాగుతారు? అంటూ విమర్శలు చేసిన పవన్, ఇపుడు దానికి రివర్స్‌లో ఇచ్చిన స్పందన అందర్నీ ఆశ్చర్యానికి గురి చేసింది. అంతే కాకుండా గత కొన్ని రోజులుగా మెగా కుటుంబం బన్నీని దూరం పెట్టడం, ఇండైరెక్ట్‌గా కామెంట్లు చేయడం అందరికీ తెలిసిన విషయమే. పవన్ వ్యాఖ్యలు కూడా వారి మధ్య ఉన్న గ్యాప్ నిజమే అన్నట్టుగా బలమైన సంకేతాలు ఇస్తున్నాయని బన్నీ ఫ్యాన్స్, సినీ వర్గాలు అంటున్నాయి.
ఎవరికి తోచినట్టు వాళ్ళు..!
ఇలా అల్లు అర్జున్ విషయంపై పవన్ స్పందన ఒక్కో మీడియా ఒక్కోలా రిపోర్ట్ చేస్తుండటంతో అసలు ఏది నమ్మాలో..? ఏది నమ్మకూడదో మెగాభిమానులు, బన్నీ వీరాభిమానులు ఒకింత డైలమాలో పడ్డారు. కొందరు పవన్ కళ్యాణ్ అల్లు అర్జున్ కు వ్యతిరేకంగా మాట్లాడినట్టు చూపించగా, మరి కొంతమంది అల్లు అర్జున్ ఒక్కడినే బాధ్యుడిని చెయ్యడం తప్పని ఆయన అన్నట్టు చెబుతున్నారు. దీనికితోడు వీడియో కూడా లేకపోవడంతో క్లారిటీ లేదు. అయితే అల్లు అర్జున్ మీద కత్తి కట్టిన ఒక వర్గం మెగా ఫ్యాన్స్ ఎటువైపు నడవాలి? అనేది పవన్ వ్యాఖ్యలను బట్టి క్లారిటీ వచ్చిందనే అభిప్రాయం వస్తోంది. ఐతే ఎవరి అభిప్రాయం ఎలా ఉన్నప్పటికీ, అల్లు అర్జున్ తర్వాత సినిమా రావడానికి కనీసం తక్కువలో తక్కువ రెండేళ్లు అయినా పడుతుంది. అప్పటికి ఎన్ని పరిణామాలు చోటు చేసుకునే అవకాశం ఉంటుందో..? ఏం జరుగుతుందో.. ఇంకా చెప్పాలంటే అప్పటికి రాజు ఎవరో..? రెడ్డి ఎవరో..? మరి.