సోషల్ మీడియా గురుంచి తెలియని వారు.. ఇప్పుడున్న టెక్నాలజీ యుగంలో లేరు. ఎందుకంటే స్మార్ట్ ఫోన్ వచ్చిన తర్వాత పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. స్మార్ట్ ఫోన్లు, సోషల్ మీడియా వినియోగం ఎక్కువ అయ్యే కొద్ది కొందరు దీన్ని క్యాష్ చేసుకోవడానికి చేస్తున్న ప్రయత్నాలు అన్నీ ఇన్ని కావు. ముఖ్యంగా ఆంధ్రపదేశ్ రాజకీయాల్లో అటు టీడీపీ, జనసేన.. ఇటు వైసీపీ మధ్య సోషల్ మీడియా వేదికగా పెద్ద యుద్ధమే నడిచింది. ఎవరికి తోచినట్టు వాళ్ళు ఇష్టానుసారం పోస్టులు చేయడం, ఫేక్ వార్తలు, రూమర్స్ ప్రచారం చేయడం పరిపాటిగా వస్తోంది. ఇంకొందరు ఐతే నేతలు, వారి కుటుంబ సభ్యులను పచ్చి బూతులు తిట్టిన సందర్భాలు ఉన్నాయి. వాళ్ళు అంతా ఇప్పుడు ఊచలు లెక్కెడుతున్నారు.
ఎక్కడ చూసినా..!
ఇప్పటికే సోషల్ మీడియా వినియోగంపై ఏపీలోని పలు ప్రముఖ ప్రాంతాల్లో పెద్ద ఎత్తున ఫ్లెక్సీలు, హార్డింగ్స్ వెలిశాయి. ఇప్పటి వరకూ ఉన్న చెడు వినకు.. చెడు మాట్లాడకు.. చెడు చూడకు అనే మూడు కోతులకు నాలుగో కోతిని జతచేసి చెడు ప్రచారం చేయకు అంటూ ఫ్లెక్సీలు వెలిశాయి. ఇలా సోషల్ మీడియాను మంచి కోసం వినియోగిద్ధాం ప్రచారం చేస్తున్న పరిస్థితుల్లో టాలీవుడ్ హీరో నిఖిల్ సోషల్ మీడియా ఎలా వాడలనే దానిపై ప్రచారం చేశారు.
జాగ్రత్త.. జీవితాలే నాశనం!
మనం ఏదైనా వస్తువు కొనేముందు దాని గురించి పూర్తిగా తెలుసుకొని కొనుగోలు చేస్తాం. కానీ, సోషల్ మీడియాలో న్యూస్ షేర్ చేసే ముందు అది నిజమా..? కాదా..? అని ఎందుకు చెక్ చేసుకోవడం లేదు? ఎందుకంటే ఏమవుతుందిలే అనే నిర్లక్ష్యంగా తీసుకుంటాం. కానీ, మీరు సరదాగా షేర్ చేసే ఆ ఫేక్ న్యూస్ కొన్ని జీవితాలను నాశనం చేస్తుంది. అందుకే మీరు ఏదైనా విషయాన్ని పంచుకునే ముందు అది నిజమా..? అపద్దమా..? అని ఒకటికి పదిసార్లు పరిశీలించండని సామజిక మాధ్యమాల వినియోగదారులు, సామాన్యులకు నిఖిల్ సూచించారు.