మెగాస్టార్ చిరంజీవి తో వర్క్ చెయ్యాలనే కోరిక ఎవరికి ఉండదు, అందులో అభిమాన హీరోతో పని చెయ్యడం ఎప్పటికీ కల లాంటి భావనే కలుగుతుంది. అదే ఇప్పుడు దసరా దర్శకుడు శ్రీకాంత్ ఓదెల ఫీలవుతున్నాడు. నాని నిర్మాతగా శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో మెగాస్టార్ మూవీ ఎనౌన్సమెంట్ కూడా వచ్చేసింది. పక్కా మాస్ మసాలా యాక్షన్ మూవీగా ఉంటుంది అని శ్రీకాంత్ ప్రీ లుక్ పోస్టర్ తోనే చెప్పేసారు.
తాజాగా మరోమారు శ్రీకాంత్ ఓదెల చిరుతో చెయ్యబోయే మూవీపై మరోసారి రియాక్ట్ అయ్యారు. చిన్నప్పటినుంచి నేను చిరంజీవిగారి సినిమాలు చూస్తూ పెరిగాను. చిరుతో కలిసి వర్క్ చేస్తున్నాను అనే విషయం ఇంకా నమ్మశక్యంగా లేదు. చిరుతో మూవీ 48 గంటల్లో స్క్రిప్ట్ ఫైనల్ చేశాం. చిరుతో సినిమా నాకైతే మబ్బుల్లో తేలుతున్నట్టు ఉంది.
చిరుతో నేను చెయ్యబోయే మూవీ మాత్రం గతంలో వచ్చినట్టుగా ఉండదు. అంతేకాదు వింటేజ్ మెగాస్టార్ ని చూడరు. ఒక ఫ్రెష్, వయసుకు తగ్గ అవతారంలో చూడబోతున్నారు. మెగాస్టార్ క్యారవాన్ నుంచి బయటికి వచ్చేవరకు మాత్రమే నేను ఆయన ఫ్యాన్. ఒక్కసారి సెట్స్ లోకి వచ్చాక చిరంజీవి గారు నా సినిమాలో ఒక క్యారెక్టర్ గా మారిపోతారు అంటూ శ్రీకాంత్ ఓదెల చిరుతో చెయ్యబోయే పై ఇచ్చిన అప్ డేట్ సోషల్ మీడియా లో మారింది.