దిల్ రాజు నిర్మాతగా భారీ బడ్జెట్ చిత్రంగా రామ్ చరణ్ హీరోగా నటించిన గేమ్ ఛేంజర్ చిత్రం జనవరి 10 సంక్రాంతి స్పెషల్ గా విడుదల కాబోతుంది. అయితే భారీ బడ్జెట్ చిత్రాలకు హెల్ప్ అయ్యే బెన్ఫిట్ షోస్ ని, టికెట్ రేట్స్ హైక్ ని తెలంగాణ ప్రభుత్వం వ్యతిరేఖించడం తో ఇప్పుడు టాలీవుడ్ దర్శకనిర్మాతల ఆశలన్నీ ఏపీ పైనే పెట్టుకున్నారు.
అక్కడ చంద్రబాబు, పవన్ టికెట్ రేట్స్ పెంచుకునే వెసులుబాటుతో పాటుగా బెన్ఫిట్ షోస్ కి అనుమతులు వస్తున్నాయి. జగన్ ప్రభుత్వంలో టాలీవుడ్ ఆటలు సాగనివ్వలేదు జగన్. కానీ చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కూటమి ప్రభుత్వం సినిమా పరిశ్రమకు అండగానే కనిపిస్తుంది. ఇప్పటికే కల్కి, దేవర చిత్రాలకు ఏపీ ప్రభుత్వం టికెట్ రేట్స్ పెంచుకునే అవకాశం ఇచ్చింది.
ఇక రెండు తెలుగు రాష్ట్రాల్లో మొదటి వారం స్పెషల్ షోస్, టికెట్ రేట్స్ హైక్ తో నిర్మాతలు ఎంతోకొంత సేవ్ అవుతున్నారు. ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం లో అది లేదు కాబట్టి ఏపీ పైనే ఆశలు పెట్టుకున్నారు. అందుకే దిల్ రాజు గేమ్ ఛేంజర్ కి పవన్ కళ్యాణ్ వచ్చేదాన్ని బట్టి ఈవెంట్ ప్లాన్ చేస్తామంటూ అభిమానులను పడగొడుతున్నారు. మరోపక్క దిల్ రాజు స్పెషల్ గా పవన్ ని మీటయ్యారు.
ఈ భేటీలో గేమ్ చేంజర్ సినిమా విడుదల విషయంలో సినిమా టికెట్ల రేట్ల విషయంపై పవన్ కళ్యాణ్ తో చర్చించే అవకాశం కనిపిస్తుంది. అంతేకాకుండా జనవరి 4 లేదా 5 తేదీల్లో విజయవాడలో జరగనున్న ఫ్రీ రిలీజ్ వేడుకకు పవన్ కళ్యాణ్ ని ఆహ్వానించినట్టుగా సమాచారం, మెగా ఈవెంట్ నిర్వహణ విషయంలో పవన్ తో చర్చిస్తున్న దిల్ రాజు గారు అనే న్యూస్ చూసి దిల్ రాజు పవన్ కళ్యాణ్ ను బాగానే కాకా పడుతున్నారంటూ నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు.