సౌత్ లో ముచ్చటగా మూడు సినిమాలతో ఇక్కడి ప్రేక్షకులకు బాగా దగ్గరైన మృణాల్ ఠాకూర్ హిందీ నుంచి సౌత్ కి వచ్చింది. సౌత్ లో సీతారామం సినిమాతో పాపులర్ అయ్యింది. అప్పటినుంచి మృణాల్ అంటే సాంప్రదాయం అంటూ తెలుగు ప్రేక్షకులు ఓన్ చేసేసుకున్నారు. ఆ తర్వాత హాయ్ నాన్న, ఫ్యామిలీ స్టార్ తో మరింత దగ్గరైంది.
ఫ్యామిలీ స్టార్ తర్వాత కాస్త గ్యాప్ ఇచ్చిన మృణాల్ ఠాకూర్ కి ఇక్కడ అడివి శేష్ సరసన అవకాశం దక్కింది. శృతి హాసన్ డెకాయిట్ నుంచి తప్పుకోవడంతో ఆమె స్థానంలోకి మృణాల్ ఠాకూర్ వచ్చి చేరింది. సోషల్ మీడియాలో అందాల ఆరబోతతో రచ్చ చేసే మృణాల్ ఠాకూర్ తాజాగా వదిలిన పిక్ మాత్రం ట్రెడిషనల్ గా ఆకట్టుకుంటుంది.
చక్కటి డిజైనర్ వేర్ లో మృణాల్ ఠాకూర్ అద్దరగొట్టేసింది. అది చూసిన ఆమె ఫ్యాన్స్ మృణాల్ బ్యూటిఫుల్ లుక్ ని తెగ వైరల్ చేస్తూ హడావిడి చేస్తున్నారు.