గ్లోబల్ స్టార్ ఎన్టీఆర్ వార్ 2 షూటింగ్ కి కాస్త రావడంతో తన ఫ్యామిలీతో కలిసి ఛిల్ అవ్వడానికే కాదు ఫ్యామిలీతో కలిసి న్యూ ఇయర్ సెలెబ్రేషన్స్ కు విదేశాలకు చెక్కేశారు. భార్య ప్రణతి, పిల్లలు అభయ్ రామ్, భార్గవ్ రామ్ లతో కలిసి ఎన్టీఆర్ లండన్ లో ప్రత్యక్షమయ్యారు.
లండన్ హైడా పార్క్ లో ఎన్టీఆర్ తన పిల్లలు, భార్యతో కలిసి ఎంజాయ్ చేస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. 2025 సంవత్సరానికి గ్రాండ్ గా వెల్ కం పలికేందుకు ఎన్టీఆర్ తన ఫ్యామిలీతో కలిసి లండన్ లో విహరిస్తున్నారు.
దేవర సక్సెస్ తర్వాత ఎన్టీఆర్ విరామం తీసుకోకుండా ముంబై వెళ్ళిపోయి తన డెబ్యూ మూవీ వార్ 2 షూటింగ్ లో పాల్గొన్నారు. దాని నుంచి బ్రేక్ దొరకగానే ఎన్టీఆర్ ఫ్యామిలీతో కలిసి లండన్ వెళ్లిపోయారు. ఇక సంక్రాంతి తర్వాత ఎన్టీఆర్-నీల్ మూవీ షూటింగ్ మొదలయ్యే అవకాశం ఉంది.