ప్రస్తుతం టాలీవుడ్ లో మోగిపోతున్న పేరు మీనాక్షి చౌదరిదే. హిట్స్ ప్లాప్స్ తో సంబంధం లేకుండా అవకాశాలు అందుకుని దూసుకుపోతున్న మీనాక్షి చౌదరి తాజాగా సంక్రాంతికి వస్తున్నాం సినిమాతో ఆడియన్స్ ముందుకు రాబోతుంది. సంక్రాంతికి మీనాక్షి మొదటిసారి వెంకటేష్ సరసన నటించిన సంక్రాంతికి వస్తున్నాం ప్రమోషన్స్ తో దుమ్మురేపుతుంది.
సోషల్ మీడియాలోనూ అప్పుడప్పుడు యాక్టీవ్ గా కనిపించే మీనాక్షి చౌదరి ఎప్పుడు ఏ ఫొటో షేర్ చేసినా అది ఇట్టే వైరల్ అవుతుంది. తాజాగా మీనాక్షి చౌదరి కొత్త లుక్ ని చూస్తే మీనాక్షి చౌదరి కటౌట్ అద్భుతం అంటారేమో. లూజ్ హెయిర్ తో మోడ్రెన్ లుక్ తో ట్రెండీ గా కనిపించింది.
ఇక టాలీవుడ్ లో అనుకోకుండా అనగనగా ఒక రోజు చిత్రంలో శ్రీలీల ప్లేస్ లో మీనాక్షి చౌదరి నవీన్ పోలిశెట్టి సరసన ప్లేస్ కొట్టేసింది. ఈ చిత్రంలో మీనాక్షి లుక్స్ అద్భుతంగా బ్యూటిఫుల్ గా కనిపిస్తున్నాయి.