శ్రీలీల, శ్రీలీల అంటూ మళ్ళీ టాలీవుడ్ యంగ్ హీరోలు ఆమెను కలవరిస్తున్నారు. గతంలో అంటే గత ఏడాది శ్రీలీల పేరు టాలీవుడ్ లో ఎంతగా వినిపంచిందో, ప్రస్తుతం అమ్మడు పేరు అంతేమోగిపోతుంది. కిస్సిక్ సాంగ్ తో రెచ్చిపోయిన శ్రీలీలకు మళ్లీ వరసగా అవకాశాలు ఇవ్వడం స్టార్ట్ చేసారు.
ఇప్పటికే రాబింగ్ హుడ్ లో నితిన్ రెండోసారి రొమాన్స్ చేస్తుంది, అంతేకాకుండా రవితేజ తో మాస్ జాతర అంటూ మళ్లీ మళ్ళీ జత కడుతుంది. ఇక నాగ చైతన్య నెక్స్ట్ చిత్రం లో శ్రీలీల హీరోయిన్ అంటున్నారు. ఇలా పాప పేరు టాలీవుడ్ లో బాగానే వినబడుతుంది. సినిమా షూటింగ్స్ ఎలా ఉన్నా శ్రీలీల మాత్రం సోషల్ మీడియాలో యాక్టీవ్ గా ఉంటుంది.
అందులో భాగంగా శ్రీలీల వదిలే ట్రెండీ లుక్స్ వైరల్ అవుతూనే ఉన్నాయి. తాజాగా కారు లో కూర్చుని శ్రీలీల గ్లామర్ గా ఇచ్చిన ఫోజుకి ఫిదా అవ్వకుండా ఉండలేరు. సిల్వర్ కలర్ బ్లౌజ్ లో ట్రెండీగా కనిపించిన శ్రీలీల తాజా లుక్ మాత్రం తెగ వైరల్ అయ్యింది.