పవన్ కళ్యాణ్ మామూలోళ్లు కాదు అని మరోసారి నిరూపించారు. ఆయన సినిమాలకు బ్రేకిచ్చినా ఆయన ఫ్యాన్స్ మాత్రం పవన్ కళ్యాణ్ ని వదలడం లేదు. రాజకీయాలంటూ మూడేళ్లు సినిమాల్లో కనిపించని పవన్.. వకీల్ సాబ్ తో వస్తే అక్కున చేర్చుకున్నారు. అయితే సినిమాల విషయంలో పవన్ ని ప్రేమించే అభిమానులు రాజకీయాల విషయంలో మాత్రం సపోర్ట్ చెయ్యలేదు.
ఈమధ్యన మాత్రం పవన్ కళ్యాణ్ సినిమా హీరోగా కన్నా రాజకీయంగానే ఎక్కువ ప్రేమిస్తున్నారు. నిజాయితీగల పొలిటికల్ లీడర్ గా పవన్ కళ్యాణ్ కనిపించడంతో వేరే హీరోల ఫ్యాన్స్ కూడా పవన్ ని లైక్ చేస్తారు. కొంతమంది ఎన్టీఆర్ అయితే మేము పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ గా మారిపోయామని కూడా చెప్పారు.
అయితే నిన్న పవన్ కళ్యాణ్ వైసీపీ దాడిలో తీవ్రంగా గాయపడిన జవహర్ కడప ఆస్పత్రిలో పరామర్శించిన పవన్ అనంతరం మీడియాతో మాట్లాడుతూ ఉన్న సమయంలో ఓజీ.. ఓజీ.. అంటూ అభిమానులు, కార్యకర్తలు స్లోగన్స్ ఇచ్చారు. దీంతో ఒకింత ఆగ్రహం, అంతకు మించి అసహనం వ్యక్తం చేసారు.
అంతేకాదు పవన్ కాస్త కోపంగానే ఏ స్లోగన్ ఎప్పుడు ఇవ్వాలో మీకు తెలియదు.. పక్కకు రండి అని చిరాకు పడిన పవన్ ని చూస్తే ఆయన ఈ అభిమానము తట్టుకోలేక సినిమాలు పక్కనపెట్టి పూర్తిస్థాయి రాజకీయనాయకుడిగా మారితే అప్పడు కానీ పవన్ ఫ్యాన్స్ కు బుద్ది రాదు అంటూ నెటిజెన్స్ మాట్లాడుకుంటున్నారు.