చాలామంది సౌత్ బ్యూటీస్ కి బాలీవుడ్ ఫైనల్ టార్గెట్ గా ఉంటుంది. నార్త్ లో జెండా పాతాలని తెగ ట్రై చేస్తూ ఉంటారు. అందులో కొంతమంది సక్సెస్ అయితే కొందరు మాత్రం గోడకు కొట్టిన బంతిలా వెనక్కి వచ్చేస్తారు. గతంలో కాజల్, త్రిష ఇలా చాలామంది హిందీలో అదృష్టాన్నిపరీక్షించుకుని తిరిగి వెనక్కి వచ్చేసినవారే.
కానీ సమంత, రష్మిక లాంటి వాళ్లకు హిందీ రెడ్ కార్పెట్ పరిచింది. అక్కడ వాళ్లకు మంచి మంచి ఆఫర్స్ రావడంతో వారు ఆల్మోస్ట్ సౌత్ ని పక్కనపెట్టేసారు. సమంత అయితే బాలీవుడ్ ప్రాజెక్ట్స్ తప్ప సౌత్ సినిమాలు చెయ్యడమే లేదు. ఇక రష్మిక నార్త్ నుంచి సౌత్ వరకు దున్నేస్తుంది. ఇప్పుడొక బ్యూటీ హిందీలో అవకాశం దక్కించుకుని లక్కీగా మారాలనుకుని గ్లామర్ గా ట్రై చేసింది.
కానీ ఆమెకి వర్కౌట్ అవ్వలేదు. ఆమె ఎవరో కాదు కీర్తి సురేష్. బేబీ జాన్ చిత్రంతో హిందీలోకి ఎంట్రీ ఇచ్చింది. అది కూడా అందాలు ఆరబోతతో. పెళ్ళయ్యాకా కాస్త గ్యాప్ కూడా ఇవ్వకుండానే కీర్తి సురేష్ బేబీ జాన్ కోసం కష్టపడింది. కీర్తి సురేష్ రెండు పాటల్లో అందాలు ఆరబోస్తూ డాన్స్ చేసి, చనిపోయే క్యారెక్టర్ చేసిన కీర్తి సురేష్ కి దర్శకుడు ప్రాధాన్యత ఇవ్వలేదు. ఆమెకి బాబీ జాన్ రిజల్ట్ షాకిచ్చింది అనే చెప్పాలి. బేబీ జాన్ తో ఎలాగైనా హిందీలో తన ముద్ర చూపించాలని తాపత్రయ పడిన కీర్తి సురేష్ కి బేబీ జాన్ షాకిచ్చింది అనే చెప్పాలి.
మరి కీర్తి సురేష్ హిందీ ఎంట్రీ ఇంత డిజప్పాయింట్ చేస్తుంది అని అనుకుని ఉండదు, అందుకే పెళ్లి అవ్వగానే ముచ్చట్లేమీ పెట్టుకోకుండా పడి పడి ప్రమోషన్స్ చేసింది, కానీ ఈ చిత్రం ఆమెని బాగా నిరాశ పరిచింది.