హరీష్ శంకర్ పవన్ కళ్యాణ్ తో సినిమా అనగానే అది తేరి రీమేక్ అని అందరూ ఫిక్స్ అయ్యారు. ఫిక్స్ అవడం కాదు .. తేరి చిత్రాన్ని తెలుగులోను డబ్ చేసారు. అయినప్పటికీ ఆ చిత్రాన్ని పవన్ తో రీమేక్ చేస్తున్నాడని హరీష్ శంకర్ ని పవన్ ఫ్యాన్స్ తెగ ఆడుకున్నారు. హరిశ్ శంకర్ ఎంతగా పోరాడినా పవన్ ఫ్యాన్స్ ఒప్పుకోలేదు.
ఉస్తాద్ భగత్ సింగ్ నుంచి హరీష్ శంకర్ అభిమానులు మెచ్చేలా వదిలిన పోస్టర్స్, గ్లిమ్ప్స్ ఫాన్స్ ట్రోలింగ్ నుంచి తప్పించింది. అప్పటినుంచి హరీష్ శంకర్ ని పొగుడుతున్నారు. కానీ ఇప్పుడు అదే తమిళ తేరి హిందీలొ రీమేక్ అయ్యింది. బేబీ జాన్ గా ఆడియన్స్ ముందుకు వచ్చిన ఈ చిత్రంలో వరుణ్ ధావన్, కీర్తి సురేష్ నాయక-నాయకులుగా కనిపించారు.
అయితే బేబీ జాన్ కి హిందీలో వచ్చిన రెస్పాన్స్ చూసాక ఏంటి.. హరీష్ శంకర్ బేబీ జాన్ ని చూడలేదా అనే కామెంట్స్ సోషల్ మీడియాలో కనబడుతున్నాయి. బేబీ జాన్ అక్కడ డల్ అవడానికి పుష్ప రాజ్ కూడా ఓ కారణం. అయినప్పటికీ బేబీ జాన్ చూసాక కొంతమంది డిజప్పాయింట్ అవడం మాత్రం పవన్ ఫ్యాన్స్ ను కలవర పెడుతుంది.