Advertisementt

మహేష్ కి హీరోయిన్ ఫిక్స్ చేసిన రాజమౌళి

Sun 29th Dec 2024 09:06 AM
rajamouli  మహేష్ కి హీరోయిన్ ఫిక్స్ చేసిన రాజమౌళి
Rajamouli fixed heroine for Mahesh మహేష్ కి హీరోయిన్ ఫిక్స్ చేసిన రాజమౌళి
Advertisement
Ads by CJ

దర్శకధీరుడు రాజమౌళి - సూపర్ స్టార్ మహేష్ కాంబో కోసం ఎదురు చూడని భారతీయుడు లేరు. గ్లోబల్ దర్శకుడుతో మహేష్ మూవీ అంటే ఎలా ఉంటుంది, ఆ క్రేజు, ఆ లేవలే వేరు. అందుకే ఆ చిత్రం ఓపెనింగ్ పై అందరూ క్యూరియాసిటీతో చూస్తున్నారు. రాజమౌళి ప్రీ ప్రొడక్షన్ కే ఏడాదికి పైగా టైమ్ తీసుకున్నారు. 

ఇక సినిమా చెయ్యడానికి ఏ ఐదేళ్లు తీసుకుంటారో అని అందరూ గుసగుసలు మొదలు పెట్టారు. తాజాగా రాజమౌళి మహేష్ కి హీరోయిన్ ని సెట్ చేసినట్లుగా చెబుతున్నారు. గత నెలలో ఈ చిత్రంలో బాలీవుడ్ స్టార్ ప్రియాంక చోప్రాను ఎంపిక చేసినట్టు గా ప్రచారం జరిగింది. అంతేకాదు ఇండొనేషియా నటి చెల్సియా ఎలిజబెత్ ఇస్లాన్ కూడా ఎంపిక చేసే ప్రయత్నాల్లో జక్కన్న ఉన్నారట.

అయితే ఈ చిత్రంలో హీరోయిన్ పాత్రకు కూడా ఎక్కువ ప్రాధాన్యత ఉండటంతో ప్రియాంక ను ఎంపిక చేసినట్టుగా తెలుస్తోంది. ఈ చిత్రం 2025 ఆరంభంలో అంటే జనవరి ద్వితీయార్ధంలో మొదలు పెట్టే ఆలోచనలో మేకర్స్ ఉన్నారు. 

Rajamouli fixed heroine for Mahesh:

Priyanka Chopra reportedly joins Mahesh Babu in SS Rajamouli next

Tags:   RAJAMOULI
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ