నేషనల్ క్రష్ రశ్మికకు ఒకప్పుడు పూజ హెగ్డే రూపంలో గట్టి పోటీ ఎదురైనా గత రెండేళ్లలో మాత్రం రష్మిక హవా బాగా నడిచింది. స్టిల్ ఇప్పటికీ రష్మిక హవానే హిందీ, తెలుగు, తమిళంలో నడుస్తుంది. యానిమల్ సక్సెస్, పుష్ప పాన్ ఇండియా హిట్ తర్వాత రష్మిక రేంజ్ పెరిగింది.
హిందీలో బిజీ అవుతున్న రష్మిక సౌత్ భాషల అవకాశాలను వదులుకుంటుంది అంటూ అభిమానులు మాట్లాడుకుంటున్నారు. ఈలోపులో సౌత్ లో శ్రీలీల-మీనాక్షి చౌదరి గాలి మొదలయ్యింది. ఏ ప్రాజెక్టు లో చూసినా శ్రీలీల, లేదంటే మీనాక్షి చౌదరి అన్నట్టుగా ఉంది వ్యవహారం. టాలీవుడ్ లో శ్రీలీల vs మీనాక్షి చౌదరి అన్న రేంజ్ లో వాళ్లలో పోటీ మొదలైంది.
ప్రస్తుతం టాలీవుడ్ లో శ్రీలీల-మీనాక్షి చౌదరిలు పేర్లే ఎక్కువగా వినిపిస్తున్నాయి. దానితో రష్మికకి కాస్త పేరు వినిపించడం తగ్గింది. మరి నార్త్ లో బిజీ అయ్యే క్రమంలో రష్మిక సౌత్ ని లైట్ తీసుకుంటుందేమో అనే అనుమానం, టెన్షన్ అభిమానుల్లో మొదలైంది.