Advertisementt

కే బ్యాచ్ అంటే కయ్యిమంటుంది

Fri 27th Dec 2024 07:02 PM
prerana  కే బ్యాచ్ అంటే కయ్యిమంటుంది
Prerana dismissed the rumors on Bigg Boss 8 కే బ్యాచ్ అంటే కయ్యిమంటుంది
Advertisement
Ads by CJ

స్టార్ మాలో ప్రసారమైన బిగ్ బాస్ సీజన్ 8 లో కన్నడ vs తెలుగు అనే రేంజ్ లో నడిచింది. స్టార్ మా యాజమాన్యం, బిగ్ బాస్ యాజమాన్యం కలిసి కన్నడ నటుడు నిఖిల్ ని విన్నర్ ని చేసారు, నిఖిల్ని విన్నర్ గా నాగార్జున ప్రకటించగానే మావోడే విన్నరయ్యాడంటూ అక్కడున్న వాళ్లలో అంటే కే బ్యాచ్ లో ఒకరు అరిచారంటూ బయట ఛానల్స్ లో కంటెస్టెంట్స్ ని ఇంటర్వ్యూలు చేస్తున్నారు.

అదే విషయాన్నీ అంటే గౌతమ్ తెలుగోడు అయినా, అతనికి ఓట్లు ఎక్కువ వచ్చిన నిఖిల్ ని కావాలని విన్నర్ ని చేసారట కదా అని కన్నడ నటి ప్రేరణ ని అడిగితే ఆమె కయ్యిమంటుంది. నిఖిల్ కంటే గౌతమ్‌కి విన్నర్ అయ్యేందుకు ఓట్లు ఎక్కువ వచ్చాయని, కానీ నిఖిల్ కే బ్యాచ్ కాబట్టి, సీరియల్ బ్యాచ్ కాబట్టి యాజమాన్యం కావాలనే అతన్ని విన్నర్‌ని చేశారని అంటున్నారు.. అని ప్రేరణను అడిగితే దానికి ప్రేరణ కస్సుమంది.

గౌతమ్ కి ఓట్లు ఎక్కువ వచ్చాయి, స్టార్ మా కావాలనే నిఖిల్ ని విన్నర్ ని చేసింది అనే దానికి ప్రూఫ్ ఉందా, ఇక్కడ ఎవరు ఎవరికీ రిలేషన్ కాదు. స్టార్ మా వాళ్లు, బిగ్ బాస్ వాళ్ళు నిఖిల్‌కి రిలేషన్ కాదు. స్టార్ మాలో ఉన్న వాళ్లు నిఖిల్ అమ్మో నాన్నో కాదు కదా. అలా అనుకుంటే.. గౌతమ్ తెలుగు వాడు. నిఖిల్ కన్నడవాడు. స్టార్ మా ఎందుకు బయటవాడ్ని విన్నర్‌ని చేస్తుంది.

బిగ్ బాస్ విన్నర్ విషయంలో పక్షపాతం చూపించలేదు. విన్నర్ అనేది లాంగ్వేజ్‌కి సంబంధించి కాదు.. వైల్డ్ కార్డ్‌కి సంబంధించింది కూడా కాదు. వైల్డ్ కార్డ్ పర్సన్‌ని విన్నర్‌ని చేయకూడదు అంటే.. ఆ కాన్సెప్ట్ ఎందుకు పెడతారు అవన్నీ కావాలని సృష్టిస్తున్న రూమర్స్ అంటూ ప్రేరణ కొట్టిపారేసింది. 

Prerana dismissed the rumors on Bigg Boss 8:

Prerana says Is there any proof that Gautham got more votes then Nikhil 

Tags:   PRERANA
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ