బాహుబలి తర్వాత సాహో చిత్రం నార్త్ కి కనెక్ట్ అవడానికి మెయిన్ రీజన్ ఆ చిత్రంలో హాలీవుడ్ రేంజ్ లో యాక్షన్ ఉండడమే. ఇక పుష్ప పార్ట్ 1 కూడా అంచనాలు లేకుండా హిట్ అయ్యింది, నార్త్ ఆడియన్స్ కి ఆ యాక్షన్ కనెక్ట్ అవడమే దానికి కారణం. ఇక కెజిఎఫ్ అయితే చెప్పక్కర్లేదు, కెజిఎఫ్ యాక్షన్ కి పాన్ ఇండియా ప్రేక్షకులు బ్రహ్మరధం పట్టారు. అలాగే ప్రభాస్ సలార్ కూడా, సలార్ పార్ట్ 1 లో కథ లేదు, కానీ ప్రభాస్ మాస్ కటౌట్ చేసే యాక్షన్ భీబత్సానికి 1000 కోట్లు సాక్ష్యం.
అందుకే చాలామంది దర్శకులు యాక్షన్ ను నమ్మి కథ లేకపోయినా.. హీరోయిజానికి పెద్ద పీట వేస్తున్నారు. ఆ యాక్షన్ ని డిఫ్రెంట్ గా తెరకెక్కిస్తే ఆడియన్స్ పడిపోతున్నారు. ఇప్పుడొక మలయాళ హీరో యాక్షన్ చిత్రం కూడా అదే రేంజ్ లో ప్రేక్షకులను పడేసింది. ఉన్ని ముకుందన్ టైటిల్ రోల్ పోషించిన మలయాళ మూవీ మార్కో ఇప్పుడు అక్కడ సన్సేషనల్ హిట్ గా నిలిచింది.
రిలీజ్ అయిన 5 రోజుల్లోనే 50 కోట్లు వసూలు చేసింది. ఆ చిత్రం లో యాక్షన్ తప్ప మరొకటి లేదు. మార్కో రివెంజ్ స్టోరీ. దర్శకుడు హనీఫ్ ఆ రివెంజ్ స్టోరి తోనే కట్టిపడేసే యాక్షన్ ఎపిసోడ్స్ తో ప్రేక్షకులను నిజంగానే కట్టిపడేసారు. మలయాళంలో సూపర్ హిట్ అయిన ఈచిత్రాన్ని ఇప్పడు మిగతా భాషల్లో విడుదలకు సిద్ధం చేస్తున్నారు మేకర్స్.