బిగ్ బాస్ సీజన్ ముగిసిన తర్వాత బయటికొచ్చాకా కంటెస్టెంట్స్ విన్నర్ అయినా, రన్నర్ అయినా, టాప్ 5 అయినా యూట్యూబ్ ఛానల్స్ లో కూర్చుని ఇంటర్వూస్ ఇస్తూ మిగతా కంటెస్టెంట్స్ పై సంచలన కామెంట్స్ చేస్తూ హైలెట్ అయ్యేందుకు హంగామా చేస్తూ ఉంటారు. అలా గత ఏడు సీజన్స్ లోను జరిగింది.
కానీ బిగ్ బాస్ 8 నుంచి మధ్యలో ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్స్ తప్ప చాలామంది బిగ్ బాస్ నుంచి బయటికి వచ్చాక కాంట్రవర్సీ కామెంట్స్ చెయ్యడం కానీ, లేదంటే బిగ్ బాస్ తో వచ్చిన క్రేజ్ వాడుకోవాలని చూడడం కానీ చెయ్యడం లేదు. విన్నర్ నిఖిల్ అయితే రెండు మూడు ఛానల్స్ ఇంటర్వూస్ లో కనిపించి కనుమరుగయ్యారు.
ఇక బిగ్ బాస్ నుంచి బయటికి వచ్చాక యూట్యూబ్ ఛానల్స్ ఏమో కానీ.. స్టార్ మా నే వారికి మళ్లి కెరీర్ ని ఇచ్చేలా ఉంది, ఇప్పటికే బిగ్ బాస్ పూర్తయ్యి వచ్ఛాక వారికి స్టార్ మా పరివార్ లోను, అలాగే ఫెస్టివ్ ఈవెంట్స్ లోను వాళ్లకు అవకాశాలు ఇస్తుంది. ఏది ఏమైనా బిగ్ బాస్ సీజన్ 8 కంటెస్టెంట్స్ మాత్రం అంతగా హైలెట్ అయ్యింది లేదు.