ఈ ఏడాది మహాశివరాత్రికి నందమూరి నటసింహ బాలకృష్ణ-దర్శకుడు బాబీ కాంబోలో తెరకెక్కుతున్న మూవీ నుంచి విడుదలైన గ్లిమ్ప్స్ చూసి మాస్ ఆడియన్స్ జాతర ఖాయమనుకున్నారు. ఆ గ్లిమ్ప్స్ లో బాలయ్య మాస్ అవతార్, ఆయన యాక్షన్ కి అభిమానులే కాదు మాస్ ఆడియన్స్ అంతా విజిల్స్ వేశారు.
ఆ తర్వాత డాకు మహారాజ్ టైటిల్, అలాగే ఆయన బర్త్ డే కి వదిలిన కంటెంట్, డాకు మహారాజ్ టీజర్ ఇవేమి మహాశివరాత్రి గ్లిమ్ప్స్ మాదిరి ఇంప్రెస్స్ చెయ్యాలేదు అంటూ నందమూరి అభిమానులే మాట్లాడుకుంటున్నారు. నాగ వంశీ పదే పదే సినిమాపై హైప్ పెంచేలా మాట్లాడుతున్నా ప్రమోషన్స్ కంటెంట్ సినిమా కి క్రేజ్ పెరిగేందుకు సరిపోదని అభిమానులు ఫీలవుతున్నారు.
డాకు మహారాజ్ పోస్టర్స్, తాజాగా వచ్చిన చిన్ని సాంగ్ ఎమోషనల్ గా కూల్ గా కనిపిస్తున్నాయి తప్ప పవర్ ఫుల్ గా లేవు, బాలయ్య పోస్టర్స్ కూడా మాస్ కి సరిపోవడం లేదు అనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. మరి సినిమాపై మరింత క్రేజ్ పెంచాలంటే ఇది చాలదు కొత్తగా ట్రై చెయ్యండి అంటూ బాబీ కి సలహాలిస్తున్నారు.