శ్రీలీల ఎన్ని సినిమాలు చేసినా రాని పేరు పుష్ప ద రూల్ లో చేసిన కిస్సిక్ సాంగ్ తో పేరొచ్చింది. వరస ప్రాజెక్ట్స్ లో అవకాశాలొచ్చాయి. కానీ వరసగా ఆమెని నిరాశపరిచే సినిమాలు ఆమెని పలకరించాయి. దానితో కాస్త గ్యాప్ వచ్చినా మళ్ళీ ఇప్పుడు యంగ్ హీరోలతో ఆఫర్స్ పట్టేస్తుంది.
ప్రస్తుతం నితిన్, రవితేజ చిత్రాల్లో నటిస్తన్న శ్రీలీల కు మరో రెండు మూడు ప్రాజెక్ట్స్ లైన్ లో ఉన్నాయి. కాకపోతే విజయ్ దేవరకొండ, నవీన్ పోలిశెట్టి చిత్రాలు నుంచి ఆమె తప్పకుండా.. లేదంటే ఆమెని తప్పించారో అనేది తెలియకపోయినా ప్రస్తుతం శ్రీలీల ఫుల్ బిజీగా ఉంది.
ఇక సోషల్ మీడియాలో ట్రెండీ లుక్స్ ని శ్రీలీల ఎప్పటికప్పుడు ఫ్రెష్ గా షేర్ చేస్తుంది. తాజాగా శ్రీలీల శారీ లుక్ షేర్ చేసింది. మత్తెక్కించే చూపులతో కిర్రాక్ లుక్స్ తో శ్రీలీల నిజంగా అద్భుతః అనిపించింది. పింక్ శారీ లో శ్రీలీల బ్యూటిఫుల్ లుక్ చూసి యూత్ మెస్మరైజ్ అవుతున్నారు. ప్రస్తుతం శ్రీలీల ట్రెడిషనల్ లుక్ మాత్రం తెగ వైరల్ అయ్యింది.