ఈమధ్యన అడివి శేష్ డెకాయిట్ నుంచి తప్పుకుని ట్రెండ్ అయిన శృతి హాసన్ పర్సనల్ లైఫ్ లో జరిగే ప్రతి విషయాన్నీ అభిమానులతో పంచుకుంటుంది. తాజాగా క్రిష్టమస్ సెలెబ్రేషన్స్ చేసుకున్న శ్రుతిహాసన్ తన లైఫ్ లో రెండు మూడు బ్రేకప్స్ ని చవి చూసింది. అంతేకాదు రీసెంట్ గా శృతి హాసన్ శాంతను తో బ్రేకప్ చేసుకుంది.
ప్రస్తుతం సింగిల్ లైఫ్ ని లీడ్ చేస్తున్న శృతి హాసన్ రిలేషన్ ఓకె కానీ.. పెళ్లంటేనే భయమేస్తుంది, తనకి పెళ్ళంటే ఇష్టం లేదు అంటూ చెప్పి షాకిచ్చింది. కొన్ని పరిస్థితుల వలన తను పెళ్లి చేసుకోవద్దని డిసైడ్ అయినట్లుగా శృతి హాసన్ చెప్పుకొచ్చింది. అయితే ఈ నిర్ణయం ఎప్పటికీ ఇలానే ఉంటుంది అని చెప్పలేను, ప్రస్తుతం అయితే పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదు అంటుంది.
అయితే తనకి రిలేషన్ లో ఉండడం మాత్రమే ఇష్టం, ఎవరైనా తన మనసుకి దగ్గరైతే అప్పుడు పెళ్లి గురించి ఆలోచిస్తాను, ప్రెజెంట్ అయితే సింగిల్ గా ఉన్నాను, రిలేషన్ కోసం వెయిట్ చేస్తున్నాను అంటూ శృతి హాసన్ పెళ్లి, రిలేషన్ పై తిక్కతిక్కగా సమాధానం చెప్పుకొచ్చింది.