నందమూరి నటసింహ-దర్శకుడు బాబీ కలయికలో నాగవంశీ నిర్మిస్తున్న డాకు మహారాజ్ మూవీ జనవరి 12 న సంక్రాంతి స్పెషల్ గా రిలీజ్ అవుతుంది. సినిమా షూటింగ్ పూర్తి కావడంతో మేకర్స్ అప్పుడే డాకు మహారాజ్ ప్రమోషన్స్ స్టార్ట్ చేసేసారు. దర్శకుడు బాబీ, నిర్మాత నాగవంశీ ఇద్దరూ డాకు మహారాజ్ పై క్రేజ్ పెంచే ఇంటర్వూస్ తో హడావిడి చేస్తున్నారు.
తాజాగా బాబీ ఓ చానల్ ఇంటర్వ్యూ లో బాలకృష్ణ కి విలన్ గా నటిస్తున్న బాబీ డియోల్ ని ఈ సినిమాలో ఎంపిక చేసింది యానిమల్ కన్నా ముందే అని, యానిమల్ రిలీజ్ అయ్యాక బాబీ డియోల్ క్రేజ్ విపరీతంగా పెరిగిపోయింది, అలాంటి బాబీ డియోల్ తో డాకు లో బాలయ్య సీన్స్ వచ్చినప్పుడల్లా అభిమానులు విజిల్స్ వెయ్యాల్సిందే.
ఇంటర్వెల్ ఎపిసోడ్లో బాలయ్య-బాబీ డియోల్ ఎదురుపడిన యాక్షన్ సీన్స్, ఇంటర్వెల్ నుంచి క్లైమాక్స్ వరకు ఇద్దరూ స్క్రీన్ మీద కనిపించిన ప్రతి సీన్ నెక్స్ట్ లెవల్ అంటూ బాబి డాకు మహారాజ్ పై అంచనాలు పెంచేసాడు