అప్పట్లో జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం ఏర్పాటు చేసాక తనని సినిమా ఇండస్ట్రీ నుంచి ఎవరూ అప్రిషేట్ చేస్తూ కలవలేదు అని, అక్కడ ఏపీలో సినిమా టికెట్ రేట్స్ తగ్గించడం, బెన్ఫిట్ షోస్ కి అనుమతులు ఇవ్వకుండా సినిమా ఇండస్ట్రీని ముప్పుతిప్పలు పెట్టిన జగన్ ని కలవడానికి అప్పట్లో మెగాస్టార్, ప్రభాస్, మహేష్ లాంటి స్టార్స్ వెళ్లారు.
జగన్ మోహన్ రెడ్డి తో మీట్ అయ్యి వంగి వంగి దండాలు పెట్టడం వారి అభిమానులకు సుతరామూ నచ్చలేదు. అయినప్పటికి జగన్ ప్రభుత్వంలో ఉన్నంత కాలం సినిమా ప్రముఖులు అణిగిమణిగి ఉన్నారు. ఆయన ఓడిపోగానే టాలీవుడ్ లో సీక్రెట్ గా చాలామంది సెలెబ్రేట్ కూడా చేసుకున్నారనే టాక్ వినిపించింది.
అదే మాదిరి తెలంగాణాలో రేవంత్ ప్రభుత్వాన్ని అప్రిషేట్ చెయ్యకపోవడం, తాను గద్దర్ అవార్డులను ప్రకటిస్తే సినిమా ఇండస్ట్రీ స్పందించకపోవడంతో రేవంత్ రెడ్డి కూడా సినిమా ఇండస్ట్రీపై పగ బట్టారు, అందులో భాగంగానే నాగార్జున ఎన్ కన్వెన్షన్ కూల్చివేత, అల్లు అర్జున్ అరెస్ట్ అని చిన్నపిల్లలు కూడా మాట్లాడుకుంటున్నారు
టాలీవుడ్ కి రేవంత్ రెడ్డికి ఏర్పడిన గ్యాప్ ని తగ్గించేందుకు సినీ ప్రముఖులు రేవంత్ ని కలిశారు. జగన్ మాదిరి రేవంత్ కూడా తమ డిమాండ్స్ నెగ్గించుకునేందుకు సినిమా ప్రమఖులకు కండిషన్స్ పెట్టారు. డ్రగ్ రహిత రాష్ట్రం కోసం సినిమా వారు సాయం చెయ్యాలి, ఏది ఏమైనా బెన్ఫిట్ షోస్, టికెట్ హైక్ కి అవకాశం ఇచ్చేదేలే అంటూ రేవంత్ సినీ ప్రముఖులకు తెగేసి చెప్పారు.
అది చూసి అప్పుడు జగన్, ఇప్పుడు రేవంత్ రెడ్డి సేమ్ టు సేమ్, సీన్ రిపీట్ అంటూ సోషల్ మీడియాలో నెటిజెన్స్ సెటైర్స్ వేస్తున్నారు.