నిజమే దేవర చిత్రం సక్సెస్ చూసాక తారక్ ఫ్యాన్స్ మామూలోళ్లు కాదు అనాల్సిందే. ఫ్యాన్స్ తలచుకుంటే ఏదైనా చెయ్యగలరు. అదే విషయం గ్లోబల్ స్టార్ ఎన్టీఆర్ స్వయానా చెప్పారు కూడా. దేవర ను రిలీజ్ చేసిన నిర్మాత నాగవంశీ కూడా అదే చెబుతున్నారు. ఆయన రీసెంట్ గా ఇచ్చిన ఇంటర్వ్యూలో దేవర విజయంపై ఎదురయ్యే ప్రశ్నలకు సరదాగా ఆన్సర్ ఇచ్చారు.
నేను ఎంత సేఫ్ గా దేవర ను ల్యాండ్ చేసానో.. తారక్ గారి ఫ్యాన్స్ కొన్నిలక్షలమంది దేవర చిత్రాన్ని అంతగా ఓన్ చేసుకుని, హ్యాండిల్ చేస్తూ దానికి మోశారు అంటూ ఎన్టీఆర్ ఫ్యాన్స్ ని నిర్మాత నాగవంశీ పొగిడేశారు. నిజంగా ఎన్టీఆర్ ఫ్యాన్స్ పూనుకోపోతే దేవర చిత్రం ప్లాప్ దిశగా పయనించేది.
దేవర చిత్రం విడుదలయ్యాక వచ్చిన టాక్ తో సంబంధం లేకుండా దేవర కలెక్షన్స్ మోత మోగించింది. అదంతా కేవలం ఎన్టీఆర్ ఫ్యాన్స్ వల్లే సాధ్యమైంది అని ఎన్టీఆర్ కూడా చాలా గర్వంగా చెబుతున్నమాట. అటు నాగవంశీ కడుఆ అదే చెప్పారు. ఇది చూస్తే ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఎంతగా ప్రాణం పెడితే కానీ దేవర హిట్ అవ్వలేదు, ఇది నిజమంటున్నారు విశ్లేషకులు.