డిసెంబర్ 5 న పాన్ ఇండియా మార్కెట్ లో విడుదలైన పుష్ప ద రూల్ నిజంగానే అన్ని భాషల మార్కెట్ ను పుష్ప 2 చిత్రం రూల్ చేస్తుంది. సినిమా ప్రీమియర్స్ నుంచే పుష్ప ద రూల్ చిత్రం రికార్డ్ కలెక్షన్స్ నమోదు చేస్తుంది. హిందీ మర్కెట్ లో పుష్ప గాడి రూల్ 700 కోట్ల మార్కెట్ ని సెట్ చేసింది.
తెలుగులోనూ, హిందీలోనూ పుష్ప ద రూల్ కలెక్షన్స్ రికార్డ్ లు సృష్టిస్తుంది. మూడో వారంలోను పుష్ప ద రూల్ ఇంకా థియేటర్స్ లో రూల్ చేస్తుంది. మూడు వారాలు తిరిగేలోపు 1700కోట్ల మార్క్ ని చేరుకొని పుష్ప కు తిరుగులేదని రుజువు చేసింది. ఫైనల్ రన్ లో పుష్ప ద రూల్ 2000 కోట్లు మార్కెట్ ని సెట్ చేస్తుంది అని అభిమానులు ధీమా వ్యక్తం చేస్తున్నారు.
1700 కోట్ల పోస్టర్ ను మేకర్స్ రిలీజ్ చెయ్యడంతో రూలింగ్, రూలింగ్ పుష్ప గాడి రూలింగ్ అంటూ నెటిజెన్స్, అల్లు అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు.