సెకెండ్ ఇన్నింగ్స్ లో క్రేజీ స్టార్ హీరోల అవకాశాలతో దూసుకుపోతున్న నటి త్రిష ప్రస్తుతం సినిమాలకు బ్రేక్ ఇవ్వబోతున్న విషయం ఆమె అభిమానులకు షాకిచ్చింది. ప్రస్తుతం త్రిష నటించిన విడాముయర్చి అలాగే విశ్వంభర చిత్రాలు విడుదలకు రెడీ అవుతున్నాయి. ఇంకా ఆమె నటిస్తున్న కొన్ని సినిమాలు సెట్స్ మీదున్నాయి.
అయితే సడెన్ గా త్రిష సినిమాలకు గ్యాప్ ఇవ్వడం వెనుక కారణాన్ని కూడా త్రిష చెప్పుకొచ్చింది. అది త్రిష పెంపుడు కుక్క జోర్రో చనిపోయింది. తన పెంపుడు కుక్క జోర్రో మరణించిందని.. జోర్రో మరణాన్ని తమ ఫ్యామిలీ మెంబెర్స్ జీర్ణించుకోలేకపోతున్నామని.. అందుకే తాను కొన్ని రోజులు సినిమాలకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నట్లుగా త్రిష చెప్పుకొచ్చింది.