టాలీవుడ్ సినీ ప్రముఖుల భేటీలో సీఎం రేవంత్ రెడ్డి కొన్ని విషయాల్లో కఠినంగా ఉంటామని, ఇంకొన్ని విషయాల్లో ఇప్పటికే తీసుకున్న నిర్ణయాల్లో ఈ మాత్రం వెనక్కి తీసుకునేది లేదని తేల్చి చెప్పేశారు. మరికొన్ని కండీషన్లు కూడా పెట్టారు సీఎం. ఇకపై బెనిఫిట్ షోలు ఉండవని ఇండస్ట్రీ పెద్దలకు తేల్చి చెప్పిన రేవంత్ రెడ్డి.. అసెంబ్లీలో చెప్పిన మాటకు కట్టుబడి ఉన్నామని స్పష్టం చేశారు. ఇక శాంతిభద్రతల విషయంలో రాజీ లేదన్నారు. అంతేకాదు.. బౌన్సర్లపై సీరియస్‌గా ఉంటామని కఠువుగా ఉంటామని చెప్పేసారు. అభిమానుల్ని కంట్రోల్ చేసుకోవాల్సిన బాధ్యత ముమ్మాటికీ సెలబ్రిటీలదేనని తెలిపారు.
ప్రమోట్ చేయండి..
ఇండస్ట్రీకి తోడుగా ప్రభుత్వం ఉంది.. ఇకపై కూడా ఉంటుందని భరోసా ఇచ్చారు. తెలంగాణ రైజింగ్‌లో ఇండస్ట్రీ సోషల్ రెస్పాన్స్‌బిలిటీతో ఉండాలి. డ్రగ్స్ క్యాంపెయిన్, మహిళా భద్రత క్యాంపెయిన్‌లో చొరవ చూపాలి. టెంపుల్ టూరిజం, ఎకో టూరిజంను ప్రమోట్ చేయాలి. ఇన్వెస్ట్‌మెంట్ల విషయంలోనూ ఇండస్ట్రీ సహకరించాలి. మళ్ళీ చెబుతున్నా ప్రభుత్వం టాలీవుడ్‌కి పూర్తి మద్దతుగా ఉంటుందని సినిపెద్దలకు నిశితంగా సీఎం వివరించారు.
ఆవేదన..
సమావేశంలో సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనపై సీఎం తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఒక మహిళ ప్రాణాలు కోల్పోవడం వల్లనే, తమ ప్రభుత్వం ఆ ఘటనను సీరియస్‌గా తీసుకుందని, అంతే తప్ప ఎవరిపైనా రివెంజ్, అంతకు మించి కోప తాపాలు అస్సలు లేవని సీఎం రేవంత్ తెలిపారు. లా అండ్ ఆర్డర్ విషయంలో రాజీ పడే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. సినీ పరిశ్రమ సామాజిక బాధ్యతతో ఉండాలని సూచించారు. సినీరంగ అభివృధి కోసం హైదరాబాద్ కాంక్లేవ్ నిర్వహించాలని, బాలీవుడ్, హాలీవుడ్ ప్రముఖులను ఆహ్వానించాలని సినీ పెద్దలకు సీఎం రేవంత్ రెడ్డి కీలక సూచనలు చేశారు.
పోలీసులు ప్రకటన..
సినిమా ప్రమోషన్స్ సమయంలో పోలీసులు అనుమతి నిరాకరిస్తే , దాని పాటించాలని పోలీసులు తేల్చి చెప్పేశారు. పోలీసులు అన్ని రకాల ఆలోచించే అనుమతి ఇవ్వాలా? వద్దా? అనేది నిర్ణయం తీసుకుంటారు. పోలీసులు నిర్ణయాన్ని గౌరవించాలి. బౌన్సర్లు నియమించుకున్నప్పుడు న్యాయ సమ్మతం ఉండాలి. ఇటీవల వారి ప్రవర్తన ఏ మాత్రం బాగోలేదు. ఏ ఈవెంట్ కైనా ముందోస్తు అనుమతులు తీసుకోవాలి, అన్ని పరిశీలించిన తరువాతే పోలీసులు నిర్ణయం తీసుకుంటారని పోలీసులు, డీజీపీ ప్రకటించారు.