మెగా హీరో రామ్ చరణ్ తన కుమార్తెని ఎప్పుడు పరిచయం చేస్తారు. పాపకి అప్పుడే ఏడాదిన్నర వచ్చేసింది. అయినప్పటికి మెగా హీరో చరణ్ ఆయన భార్య ఉపాసనలు తమ కుమార్తె క్లింకార ని మాత్రం చూపించకుండా ఇంకా దాగుడు మూతలాడుతున్నారు. ఇప్పటివరకు పాప ఫేస్ ని రివీల్ చెయ్యలేదు.
సెలబ్రిటీస్ మీడియాలో తమ పిల్లలు హైలెట్ అవ్వకుండా ఉండేందుకు ఎన్ని జాగ్రత్తలు తీసుకోవాలో చరణ్-ఉపాసనలు అంతకుమించి జాగ్రత్తలు తీసుకుంటున్నారు. కానీ ఈ విషయంలో మెగా ఫ్యాన్స్ అసంతృప్తిగా ఉన్నారు. మెగా మనవరాలు క్లింకార దర్శనం కోసం చాలా అంటే చాలా వెయిట్ చేస్తున్నారు.
తాజాగా రామ్ చరణ్-ఉపాసనలు తమ స్టాఫ్ తో కలిసి క్రిస్టమస్ సెలెబ్రేషన్స్ చేసుకున్నారు. ఇక్కడ కూడా క్లింకార చరణ్ పెట్ రైమ్ తో ఆడుకుంటున్న పిక్స్ వదిలారు కానీ.. క్లింకార ఫేస్ మాత్రం రివీల్ చెయ్యలేదు.. దానితో చరణూ కూతుర్ని ఎప్పుడు చూపిస్తావ్ అంటూ మెగా ఫ్యాన్స్ అడుగుతున్నారు.